Shyam Singha Roy: రోజీ సింగరాయ్ కోసం.. ఆన్‌లైన్‌ క్లాస్‌లోకి వచ్చిన శ్యామ్‌ సింగరాయ్‌! షాక్‌లో హీరో నాని!!

తాను శ్యామ్​ సింగరాయ్ అంటూ ఓ స్టూడెంట్ ఆన్​లైన్ క్లాస్‌లో తన లెక్చరర్​ను సరదాగా ఆటాడుకున్నాడు. ఇందుకు మరోకొంతమంది స్టూడెంట్స్‌ అండగా నిలిచారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ ఒకటి నెట్టింట వైరల్ అయింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2022, 08:58 AM IST
  • ఆన్‌లైన్‌ క్లాస్‌లోకి వచ్చిన శ్యామ్‌ సింగరాయ్‌
  • ఆన్‌లైన్‌ క్లాస్‌లో స్టూడెంట్ రచ్చ
  • షాక్‌లో హీరో నాని
Shyam Singha Roy: రోజీ సింగరాయ్ కోసం.. ఆన్‌లైన్‌ క్లాస్‌లోకి వచ్చిన శ్యామ్‌ సింగరాయ్‌! షాక్‌లో హీరో నాని!!

Shyam Singha Roy is in Telugu Online Class: నేచురల్​ స్టార్​ నాని (Nani), స్టార్ హీరోయిన్​ సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించిన ప్రేమ కావ్యం 'శ్యామ్​ సింగరాయ్​' (Shyam Singha Roy). యువ డైరెక్టర్ రాహుల్​ సాంకృత్యాన్ (Rahul Sankrityan)​ దర్శకత్వంలో పునర్జన్మ ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా గతేడాది విడుదలై భారీ హిట్ కొట్టింది. డ్యూయెల్ రోల్‌లో నాని ఆకట్టుకోగా.. రోజీ పాత్రలో సాయిపల్లవి జీవిచేసింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా శ్యామ్​ సింగరాయ్ స్ట్రీమింగ్ అవుతోంది. దాంతో ఈ సినిమా అన్నిరకాల ప్రేక్షకులకు మరింత చేరువైంది. సినిమా చూసిన అందరూ నాని, సాయిపల్లవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

సోషల్ మీడియా పుణ్యమా అని ఇటీవలి కాలంలో ప్రతిఒక్కరు ఫేమస్ అవుతున్నారు. కొందరు ప్రతి సినిమాలోని ఫేమస్ డైలాగ్స్, పాటలను రీల్స్. స్పూఫ్స్, రీ క్రియేట్ చేస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్టూడెంట్ అందరికంటే ముందడుగు వేసి.. ఆన్‌లైన్‌ క్లాస్‌లో రచ్చ చేశాడు. తాను శ్యామ్​ సింగరాయ్ అంటూ ఓ స్టూడెంట్ (Student) ఆన్​లైన్ క్లాస్‌ (Online Class)లో తన లెక్చరర్​ (Lecturer)ను సరదాగా ఆటాడుకున్నాడు. ఇందుకు మరోకొంతమంది స్టూడెంట్స్‌ అండగా నిలిచారు. విషయంలోకి వెళితే... 

Also Read: Horoscope Today January 29 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ధన, ధాన్య లాభాలు!!

ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ పంజా విసురుతుండంతో అన్ని పాఠశాల, కళాశాల స్టూడెంట్ ఆన్‌లైన్‌ క్లాస్‌లు వింటున్నారు. ఓ ప్రముఖ ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన స్టూడెంట్ ఆన్‌లైన్‌ క్లాస్‌లో తన ఐడీని 'శ్యామ్‌ సింగరాయ్‌'గా మార్చుకున్నాడు. క్లాస్ ఆరంభ సమయంలో అటెండన్స్ కోసం లెక్చరర్​ అందరి ఐడీలను చెక్ చేస్తుండగా.. అతడికి శ్యామ్‌ సింగరాయ్‌ అనే పేరు కనిపించింది. ఇది నిజంగానే నీ పేరా? లేక సినిమా పేరుని మీ ఐడీగా పెట్టుకున్నావా?' అని లెక్చరర్‌ అడగ్గా.. అది తన పేరేనని ఆ స్టూడెంట్ చెప్పాడు. తన సతీమణి రోజీ సింగరాయ్‌ (Rosie Singha Roy) కూడా ఈ క్లాస్‌లోనే ఉందని, తమని కలపాల్సిన బాధ్యత మీదే సర్ అని కూడా అన్నాడు. 

సదరు స్టూడెంట్ తాను పునర్జన్మ ఎత్తానంటూ లెక్చరర్‌కి సినిమా కథ చెప్పాడు. ఇది విన్న లెక్చరర్‌ క్లాస్‌ అయ్యాక మనమిద్దరం మాట్లాడుకుందామని చెప్పాడు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ని ఓ నెటిజన్‌ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు 'శ్యామ్‌ సింగరాయ్‌' చిత్రబృందాన్ని ట్యాగ్‌ చేస్తూ 'ఆన్‌లైన్‌ క్లాస్‌లో శ్యామ్‌ సింగరాయ్‌' అని ట్వీట్ చేశాడు. అది చూసిన హీరో నాని, దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్ షాక్‌ అయ్యారు. ఈ ఆడియోని సరదాగా క్రియేట్‌ చేశారా? లేదా నిజంగానే ఆన్‌లైన్‌ క్లాస్‌లో జరిగిందా? తెలియరాలేదు. ఏదేమైనా ఈ ఘటనను మాత్రం అందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

Also Read: Darshanam Mogilaiah: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు సీఎం కేసీఆర్ రూ.1 కోటి నజరానా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News