TSPSC Group-2 exam Postponed: ఈ నెల 29, 30వ తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలను ప్రభుత్వం నవంబరుకు వాయిదా వేసింది. గ్రూప్-2 పరీక్షను(TSPSC Group-2 exam) వాయిదా వేయాలని అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం దిగొచ్చింది.  ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరీక్షలను నవంబరుకు వాయిదా వేసినట్లు శనివారం రాత్రి ప్రకటించారు. దీంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గ్రూప్‌-2 కింద 783 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌ 29న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రూప్-2 పరీక్ష వాయిదా గురించి అంతకముందే మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణలోని లక్షల మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో సంప్రదించి గ్రూప్‌-2 పరీక్షను రీషెడ్యూల్‌ చేయాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. ప్యూచర్ లో పోటీ పరీక్షల నోటిఫికేషన్‌ల జారీలో ప్రణాళికాబద్ధంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారని.. దీని ద్వారా అభ్యర్థికి అర్హత ఉన్న అన్ని ఎగ్జామ్స్ కు సిద్ధం కావడానికి తగిన సమయం లభిస్తుందని పేర్కొన్నారు.


గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని కొద్ది రోజులగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. గురువారం అభ్యర్థులు టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించారు. అంతేకాకుండా కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం కూడా చేశారు.  వారికి వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ పరీక్షలపై సోమవారం హైకోర్టులో కూడా విచారణ జరగనుంది. 


Also Read: MLA Etela Rajender: నీ అబ్బ జాగీరా కేసీఆర్..? ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook