Telangana Group1 Exams Result 2023: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్ల జారీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. గ్రూప్ 1 పరీక్షల కోసం దరఖాస్తు చేయకుండానే ఒక అభ్యర్థినికి హాల్ టికెట్ జారీ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన జక్కుల సుచిత్ర గ్రూప్-3,4 పరీక్షలకే దరఖాస్తు చేసి ఉన్నారు. కాగా తాజాగా జరిగిన గ్రూప్-1 పరీక్షకు సైతం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( టిఎస్పీఎస్సీ ) హాల్ టికెట్ జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్లై చేయకుండానే హాల్టికెట్ రావడంపై సుచిత్ర అయోమయానికి గురయ్యారు. గ్రూప్ 1 పరీక్షలకు దరఖాస్తు చేయకుండానే హల్ టికెట్ రావడంతో ఆందోళనకు గురయ్యానని అన్నారు. చదవకుండానే, ఆన్లైన్లో దరఖాస్తు చేయకుండానే ఎలా రాయడం అనే ఆలోచన తనను ఉక్కిరిబిక్కిరి చేసిందన్న జక్కుల సుచిత్ర.. ఒకవేళ పరీక్ష కేంద్రానికి వెళ్లినా తనకు ఓఎంఆర్ షీట్ ఇస్తారో లేదో అనే భయంతో ఎగ్జామ్ సెంటర్కు కూడా వెళ్లలేదని పేర్కొన్నారు. 


తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షల్లో ఇలాంటి తప్పిదాలు జరగడం విచిత్రంగా ఉందని సుచిత్ర తండ్రి జక్కుల శ్రీధర్ అన్నారు. ఇదిలావుండగా సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మార్వోకు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 


ఇది కూడా చదవండి : BJP About KCR: మోదీ వ్యాక్సిన్ ఇప్పిస్తే.. కేసిఆర్ మందు పోయిస్తుండు


ఇప్పటికే పేపర్ లీకేజీల వివాదంతో ఒకసారి రాసిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసిన టిఎస్పీఎస్సీ.. రెండోసారి ఈ పరీక్షను నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈసారి అయినా ఎలాంటి పొరపాట్లు లేకుండా పరీక్ష నిర్వహిస్తారా లేదా అనే భయం అభ్యర్థులను వెంటాడుతున్న క్రమంలోనే మరోసారి టిఎస్పీఎస్సీలో లుకలుకలను వేలెత్తి చూపించేలా జరిగిన ఈ ఘటన గ్రూప్ 1 పరీక్ష రాసిన అభ్యర్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 


ఇది కూడా చదవండి : BRS MLA Durgam Chinnaiah: మరో వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK