TSPSC Group-1 Prelims exam date 2023: రేపు తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. జూన్ 11న (ఆదివారం) జరగబోయే ఈ పరీక్షకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎగ్జామ్ జరగనుంది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని అధికారులు ఇది వరకే ప్రకటించారు. పరీక్ష రాయడానికి వచ్చే వారు హాల్‌టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తీసుకువస్తే సరిపోతుంది. ఈ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లుచేసి.. పరీక్ష సాఫీగా జరిగేలా చూడాలని సీఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్రంలో 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా.. 3,80,052 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2.86 లక్షల మంది హాజరయ్యారు. ప్రశ్నపత్రాల లీక్ అవ్వడంతో పరీక్షను రద్దు చేసిన కమిషన్ ఆదివారం మళ్లీ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ ఎగ్జామ్ కు సంబంధించి 2.75 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్ష కోసం 994 ఎగ్జామ్ సెంటర్స్ ను కేటాయించారు. ఎవరైతే పరీక్ష రాస్తున్నారో వార ప్రశ్నాపత్రం వేరే భాషలో ఉంటే వెంటనే ఇన్విజిలేటర్‌ను అడిగి మరొకటి తీసుకోవాలని కమిషన్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఓఎంఆర్‌పై ప్రశ్నపత్రం కోడ్‌ను తప్పనిసరిగా రాయాలని పేర్కొన్నాయి.
Also Read: Telangana: వేడెక్కుతున్న తెలంగాణ.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు.. ఇవాళ, రేపు కూడా అలానే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి