HMPV Virus Do's and Don'ts: చైనాలో వ్యాపించి భారతదేశంలోకి ప్రవేశించిన మెటాన్యుమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హెచ్‌ఎంపీవీ వైరస్‌ శరవేగంగా విస్తరిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: HMPV Virus: దేశంలోకి చొచ్చుకొస్తున్న చైనా HMPV వైరస్.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా?


కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ ప్రజారోగ్యం- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ బీ రవీందర్ నాయక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క హెచ్ఎంపీవీ కేసు నమోదు కాలేదని ప్రకటించారు. వైరస్‌ బారిన పడకుండా ఉండటానికి పలు సూచనలు చేశారు.

Also Read: KT Rama Rao: క్వాష్‌ పిటిషన్‌ రద్దుపై కేటీఆర్‌ సంచలన ట్వీట్‌.. 'నా నోరు మూయించలేరు'


హెచ్ఎంపీవీ మరో రెస్పిరేటరీ వైరస్ అని.. చలికాలంలో జలుబు, ఫ్లూ తరహా లక్షణాలు కనిపిస్తాయి. చిన్నారులు, వృద్ధులు ఈ వైరస్‌ బారిన పడే అవకాశం ఉంది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు కొన్ని సూచనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. చేయాల్సినవి- చేయకూడని వివరాలు ఇలా ఉన్నాయి.


చేయాల్సినవి


  • దగ్గు, తుమ్ముతున్నప్పుడు నోటికి లేదా ముక్కుకు హ్యాండ్ కర్చీఫ్ లేదా టిష్యూ పేపర్ను అడ్డు పెట్టుకోవాలి.

  • సబ్బు లేదా అల్కహాల్‌తో కూడిన శానిటైజర్‌తో తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి.

  • అధిక సంఖ్యలో ప్రజలు ఉండే ప్రదేశాలకు వెళ్లకూడదు. అలాంటి ప్రదేశాలకు వెళ్లితే జాగ్రత్తలు పాటించాలి. ఫ్లూతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి.

  • జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతుంటే బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదు. అధిక మంది ఉన్న చోట తిరగరాదు.

  • వీలైనంత అధికంగా తాగునీళ్లు తీసుకోవాలి. పౌష్టికాహారం తినాలి.

  • అనారోగ్యంతో బాధపడుతుంటే బయటకు వెళ్లరాదు. ఇతరులను కలుసుకోవడాన్ని తగ్గించి ఇంట్లోనే ఉండాలి.

  • ఇంట్లో గాలి ధారాళంగా వచ్చేలా చేసుకోవాలి.

  • కంటి నిండా నిద్రపోవాలి.


చేయకూడనివి..


  • ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు. నమస్కారంతో పలకరించాలి.

  • ఒకసారి వినియోగించిన టిష్యూ పేపర్లు, హ్యాండ్ కర్చీఫ్‌ను మళ్లీ వాడకూడదు.

  • అనారోగ్యంతో బాధపడుతున్న వారితో దూరంగా ఉండాలి.

  • తరచూ కంటిని నలుపుకోవడం, ముక్కు, నోటిని చేతితో తుడుచుకోరాదు.

  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు.

  • వైద్యుడిని సంప్రదించకుండా సొంతంగా ఎలాంటి మందులు వేసుకోరాదు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.