Telangana High Court: దళిత బందు పథకంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటీషన్‌పై అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించింది. జాబితా ప్రకారమే విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ప్రభుత్వం(Telangana government)ఇటీవల ప్రకటించిన దళిత బంధు పథకంపై ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని దళితుల్ని మభ్యపెట్టేందుకే ఈ పథకం ప్రవేశపెట్టారనేది ప్రతిపక్షాల ఆరోపణ. మరోవైపు ఇదే అంశంపై తెలంగాణ హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలైంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళిత బంధు(Dalit Bandhu Scheme)పథకాన్ని నిలిపివేయాలని కోరుతూ జనవాహిని పార్టీ , జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీ హైకోర్టులో పిల్ దాఖలు చేశాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపధ్యంలో అదే నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని పిటీషన్‌లో పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమీషన్, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సీఎం కేసీఆర్ తదితరుల్ని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దళిత బంధు పథకంపై దాఖలైన పిటీషన్‌ను అత్యవసరంగా విచారించలేమని తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఛీఫ్ జస్టిస్ హిమ కోహ్లి స్పష్టం చేశారు. జాబితా ప్రకారమే విచారిస్తామని..అప్పటి వరకూ ఆగాలని సూచించారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా నేపధ్యంలో హుజూరాబాద్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఎప్పుడు నిర్వహించేది ఇంకా స్పష్టత రాలేదు. 


Also read: కృష్ణా జలాల వివాదంపై ఛీప్ జస్టిస్ ఎన్ వి రమణ కీలక వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook