Telangana Lockdown: లాక్‌డౌన్ ప్రకటనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Telangana Lockdown: కరోనా మహమ్మారి నియంత్రణకై తెలంగాణ రాష్ట్రం సైతం లాక్‌డౌన్ ప్రకటించింది. అయితే లాక్‌డౌన్ విధించకపోవడంపై ఆగ్రహించిన హైకోర్టు..హఠాత్తుగా లాక్‌డౌన్ ప్రకటనపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది.
Telangana Lockdown: కరోనా మహమ్మారి నియంత్రణకై తెలంగాణ రాష్ట్రం సైతం లాక్‌డౌన్ ప్రకటించింది. అయితే లాక్‌డౌన్ విధించకపోవడంపై ఆగ్రహించిన హైకోర్టు..హఠాత్తుగా లాక్‌డౌన్ ప్రకటనపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం(Telangana government)పై హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా మహమ్మారి కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి అంటే మే 12 నుంచి పదిరోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది. ఈ నిర్ణయంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంత హఠాత్తుగా రేపటి నుంచి లాక్‌డౌన్ అంటే ఇతర రాష్ట్రాల ప్రజల పరిస్థితి ఏంటని కోర్టు ప్రశ్నించింది. కనీసం వీకెండ్ లాక్‌డౌన్ ఆలోచన లేకుండా ఇంత అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడమేంటని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇంత తక్కువ సమయంలో ఇతర ప్రాంతాలకు చెందివాళ్లు ఎలా వెళ్తారని హైకోర్టు (High Court) ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
లాక్‌డౌన్ సందర్బంగా అత్యవసర పాస్‌లు ఇస్తామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. సరిహద్దు వద్ద అంబులెన్స్ (Ambulance issue)నిలిపివేతకు సంబంధించి ఏమైనా ఆదేశాలున్నాయా అనే కోర్టు ప్రశ్నకు లిఖితపూర్వక ఆదేశాల్లేవన్నారు. ఓరల్ ఆర్డర్ ఉందా అంటే..సీఎస్ ను అడిగి చెబుతానన్నారు. ఇక సరిహద్దులో అంబులెన్స్‌లను నిలిపివేయవద్దని హైకోర్టు పోలీసుల్ని ఆదేశించింది.
వాస్తవానికి తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. లాక్‌డౌన్ (Lockdown)పెడతారా లేదా కఠిన అంక్షలు అమలు చేస్తారా అనేది తేల్చాలని స్పష్టం చేస్తూ గడువు విధించింది. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ అంశాలపై తెలంగాణ కేబినెట్ చర్చించి..లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుంది.
Also read: Telanagana Lockdown: తెలంగాణలో రేపటి నుంచి పదిరోజుల పాటు లాక్‌డౌన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook