Bandi Sanjay Padayatra: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. భైంసాలోకి వెళ్లకుండా బయట నుంచి పాదయాత్ర చేసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. భైంసాలో సభ నిర్వహించొద్దని తెలిపింది. భైంసాకు మూడు కిలోమీటర్ల దూరంలో సభ పెట్టుకోవచ్చు అని హైకోర్టు అభిప్రాయపడింది. నిర్మల్ మీదుగా పాదయాత్ర చేపట్టాలని.. అందులో 500 మంది మాత్రమే ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. సభకు 3 వేల మంది మాత్రమే ఉండాలని తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాదయాత్రలో, సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు తేల్చి చెప్పింది. బండి సంజయ్ పాదయాత్రకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. దీంతో బండి సంజయ్‌కు ఊరట కలిగినట్లు అయ్యింది. గతంలోనూ ఇలాంటి పరిస్థితి రావడంతో కోర్టు అనుమతితోనే పాదయాత్ర చేపట్టారు బండి సంజయ్. 3 కిలోమీటర్ల దూరంలో సభ లేదని భావిస్తే.. పోలీసులు అడ్డు చెప్పవచ్చని కోర్టు తెలిపింది. సభకు పోలీసులు తప్పకుండా సహకరించాలని సూచించింది. 


కోర్టు సూచనల మేరకు పాదయాత్ర నిర్వహిస్తామని బీజేపీ నేత, పాదయాత్రి ఇంఛార్జ్ గంగిడి మనోహర్ తెలిపారు. సోమవారం సమయం లేనందున రేపటి (మంగళవారం) నుంచి పాదయాత్ర, సభ నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని, కుటుంబ పాలన ఎండగడుతూ ప్రజా సంగ్రమ యాత్ర జరుగుంతుందన్నారు. ఈ యాత్రను టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. 


'మొదటిసారి పాదయాత్ర విజయవంతం కావడంతో.. ప్రభుత్వం ఓర్వలేక అడ్డుకుంటోంది. గతంలో కూడా ప్రభుత్వం నడ్డా గారి సభను అడ్డుకుంది. అయినా ఏ గొడవ చేయకుండా మేము న్యాయస్థానాలను ఆశ్రయించాం. మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ యాత్ర గురించి 10 రోజులు క్రితం పోలీస్ పర్మిషన్ గురించి అనుమతి పత్రాలు ఇచ్చాం.


ఆదివారం చివరి క్షణంలో పోలీస్ వారు ఎలాంటి రాత పూర్వకంగా లేకుండా చివరి సమయంలో రద్దు చేశారు. మేము కోర్టును ఆశ్రయించారు. గతంలో కూడా భైన్సా పట్టణంలో ఇండ్లు కాలబెట్టినప్పుడు కూడా మా ఎంపీ గారిని అరెస్ట్ చేశారు. ఈ రోజు మా ప్రజా సంగ్రామ యాత్ర జరుపుకోవడం కోసం కోర్టు నిర్ణయం తీర్పుపై ధన్యవాదాలు చెబుతున్నాం. ఈ రోజు సభ రేపటికి వాయిదా వేసి రేపటి నుంచి రీ షెడ్యూల్ చేసి కొనసాగిస్తాం..' అని గండి మనోహర్ తెలిపారు.


Also Read: Meerut Students: క్లాస్ రూమ్‌లోనే టీచర్‌కు ఐ లవ్ యూ.. ముగ్గురు విద్యార్థులు అరెస్ట్   


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు తరువాత కీలక ప్రకటన  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook