Meerut Students: క్లాస్ రూమ్‌లోనే టీచర్‌కు ఐ లవ్ యూ.. ముగ్గురు విద్యార్థులు అరెస్ట్

Meerut Students Harassment: యూపీలో ముగ్గురు విద్యార్థులు బరితెగించారు. తరగతి గదిలోనే టీచర్‌ను వేధించారు. అసభ్య కామెంట్స్ చేయడంతోపాటు అందరి ముందే ప్రపోజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 28, 2022, 12:53 PM IST
Meerut Students: క్లాస్ రూమ్‌లోనే టీచర్‌కు ఐ లవ్ యూ.. ముగ్గురు విద్యార్థులు అరెస్ట్

Meerut Students Harassment: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మహిళా టీచర్‌పై వేధింపులకు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. థానా కితౌర్‌లో ప్రాంతంలోని ఓ ఇంటర్మీడియట్ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు తమ టీచర్‌ను నిత్యం వేధిస్తున్నారు. ఈ వేధింపులకు సంబంధించిన వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా.. టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

థానా కితౌర్‌లో ఉన్న రామ్ మనోహర్ లోహియా ఇంటర్ కాలేజీలో జరిగిన సంఘటన ఇది. ఇక్కడ కాలేజీలో చదువుతున్న ముగ్గురు 12వ తరగతి విద్యార్థులు.. తరగతిలో బోధిస్తున్న టీచర్‌ని నిత్యం వేధిస్తున్నారు. క్లాస్ రూమ్‌లో కామెంట్స్ చేయడంతో పాటు.. స్టూడెంట్స్ అందరి ముందు ఆమెకి I LOVE YOU చెప్పేవారు. అంతేకాకుండా టీచర్ ఎక్కడ కనిపించినా.. రోడ్డుపై కూడా టీచర్‌పై కామెంట్స్ చేశారు. వీరి వేధింపులు భరించలేక టీచర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. చాలా రోజులుగా ముగ్గురు విద్యార్థులు తనను వేధిస్తున్నారని ఆమె చెప్పారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. 

 

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో.. విద్యార్థులు టీచర్‌ను 'జాన్' అని సంబోధించారు. అనంతరం విద్యార్థులు టీచర్‌తో ‘ఐ లవ్‌ యూ’ అన్నారు. ముగ్గురు విద్యార్థులు టీచర్‌తో ఎలా దురుసుగా ప్రవర్తిస్తున్నారో వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని వారాలుగా 12వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ మహిళా ఉపాధ్యాయురాలు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆమె పాఠశాలకు వెళ్లేటప్పుడు.. ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు వారు చాలాసార్లు అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. అంతే కాకుండా రోడ్డుపై ఆమెను చుట్టుముట్టేవారు. 

విద్యార్థుల తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసినా.. వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉపాధ్యాయురాలు చెప్పిందని పోలీసు అధికారి తెలిపారు. ఉపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు విద్యార్థులపై ఐపీసీ సెక్షన్లు 354, 500, ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు తరువాత కీలక ప్రకటన  

Also Read: Anchor Ravi Wife : 18 ఏళ్ల పరిచయం.. పదేళ్ల వివాహా బంధం.. యాంకర్ రవి ఎమోషనల్ పోస్ట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News