Telangana: రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు షోకాజు నోటీసులు
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పదమయ్యారు. దిశ ఎన్ కౌంటర్ చిత్రంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆర్జీవీకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పదమయ్యారు. దిశ ఎన్ కౌంటర్ చిత్రంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆర్జీవీకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
వివాదాలకు కేంద్రబిందువుగా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ramgopal varma )..మరోసారి చర్చనీయాంశమయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన దిశ హత్యాచారం, అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్ ( Encounter )పై ఆర్జీవీ సినిమా తీస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్‌కౌంటర్‌కు గురైన కుటుంబాలు ఇప్పటికే తీవ్ర వేదనకు లోనవుతున్నారని..ఇలాంటి సమయంలో వర్మ సినిమా ద్వారా వారిని ఊర్లో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారని పిటీషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు.
చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని కోరారు. దిశ సంఘటనపై ఓ వైపు జ్యుడిషియల్ విచారణ నడుస్తుండగా..సినిమా ఎలా తీస్తారని కోర్టుకు వివరించారు. ఈ వాదనలు విన్న తరువాత తెలంగాణ హైకోర్టు ( Telangana High court )..సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై, బ్రాంచ్ ఆఫీస్ హైదరాబాద్, రామ్ గోపాల్ వర్మ, సెక్రటరీ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలుకు వాయిదా వేసింది.
మరోవైపు దిశ ఎన్‌కౌంటర్ ( Disha Encounter ) చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేసేందుకు వర్మ ఏర్పాట్లు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో విడుదలైంది.
Also read: GHMC Elections: పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్..నిజమేనా