తెలంగాణ రాష్ట్రలో  సెప్టెంబర్ 1నుంచి పాఠశాలలు ప్రారంభం (Telangana Schools Re-open) కాబోతున్నాయన్న విషయం అందరికి తెలిసిందే. ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా సంక్రమణ పూర్తిగా తగ్గకపోయిన విద్యాసంస్థల రీఓపెనింగ్ కి అన్ని విధాల ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కానీ, కరోన థర్ట్ వేవ్ (Corona 3rd wave) హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో పిల్లలు స్కూల్స్ కి రావటం వారి తల్లి తండ్రుల అనుమతి తప్పనిసరి చేసింది. ఒకవేళ స్కూల్ కి వచ్చే అవకాశం లేని పిల్లల కోసం ఆన్ లైన్ క్లాసులు (Online classes)వినేలా విద్యాసంస్థల యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇది ఇలా ఉండగా.. తెలంగాణహైకోర్టులో  (Telangana High court) విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై పిల్ నమోదయ్యింది. ప్రైవేట్‌ స్కూల్ టీచర్ బాలకృష్ణ (Balakrishna) హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కరోనా మూడో దశ (Corona 3rd Wave) ముప్పు ఉన్నందున ప్రి ప్రైమరీ, ప్రైమరీ తరగతులకు ప్రత్యక్ష బోధన ఆందోళన కలిగిస్తోందన్నారు పిటిషనర్. ఎలాంటి గైడ్ లెన్స్ (Corona Guidlines) లేకుండా ప్రభుత్వం విద్యా సంస్థలు ఎలా తెరుస్తారని పిటిషనర్ పేర్కొన్నాడు. 


Also Read: Varudu Kaavalenu Teaser: "అమ్మో.. దీన్ని ఎవడు చేసుకుంటాడో గానీ.." టీజర్ సింప్లీ సూపర్బ్!


ప్రత్యక్ష భోదన (Schools Re-open) కారణంగా స్కూల్ లో  సిబ్బంది, విద్యార్థులు, భోదకులు అందరు కలిసి వందల మందిలో ఉంటారని మరియు కరోనా వైరస్ (Corona Virus) సులువుగా సంక్రమణ జరుగుతుందని పిటిషనర్ కోర్టులో తెలిపారు. 


అంతేకాకుండా,తెలంగాణలో కరోనా వైరస్ తగ్గిందని చెప్పటానికి ప్రభుత్వం (Telangana Governament) ఎలాంటి ఆధారాలను సమర్పించలేదని ప్రైవేట్ ఉపాధ్యాయుడు బాలకృష్ణ హైకోర్టులో తెలిపారు. ఈ వాదనలను విన్న ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. 


కరోనా థర్ట్ వేవ్ (Covid-19 3rd Wave) భయం ఇంకా ఉన్నందున ప్రత్యక్ష భోదనపై తల్లి దండ్రుల నుండి మిశ్రమ స్పందన వస్తుంది. మరోవైపు స్కూల్ లో ఐదుగురికి పాజిటివ్ వస్తే స్కూల్ మూసేయాలని ఆరోగ్య శాఖ (Telangana health ministry) ఆదేశించింది. కరోనా ముప్పు తగ్గించటానికి ఎప్పటికపుడు శానిటైజేషన్‌, విద్యార్థుల మధ్య భౌతిక దూరం (Social Distance) ఉండేలా విద్యాసంస్థలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 


Also Read: EPFO Alert: ఈపీఎఫ్ ఖాతాదారులకు హెచ్చరిక.. రేపే ఆఖరి తేదీ.. ఇలా చేయకపోతే PF రాదు


ఇదిలా ఉండగా పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని విద్యాసంస్థల ప్రారంభంపై నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి (Minister of Education of Telangana) సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) తెలిపారు. ఆన్ లైన్ క్లాసులు పిల్లల్లో ప్రభావితం చేయట్లేదని ఆలస్యం చేసిన కొద్ది వారిలో మానసిక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని. పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి covid 19 నిబంధనలు (Covid 19 precautions) పాటిస్తూ పాఠశాలలు నిర్వహిస్థామని మంత్రి తెలిపారు.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook