Varudu Kaavalenu Teaser: "అమ్మో.. దీన్ని ఎవడు చేసుకుంటాడో గానీ.." టీజర్ సింప్లీ సూపర్బ్!

Varudu Kaavalenu Teaser: నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన ‘వరుడు కావలెను’ సినిమా టీజర్ వచ్చేసింది. లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 31, 2021, 12:58 PM IST
  • 'వరుడు కావలెను' టీజర్ రిలీజ్
  • హీరో హీరోయిన్లుగా నాగశౌర్య, రీతూవర్మ
  • లక్ష్మి సౌజన్య దర్శకత్వం
Varudu Kaavalenu Teaser: "అమ్మో.. దీన్ని ఎవడు చేసుకుంటాడో గానీ.." టీజర్ సింప్లీ సూపర్బ్!

Varudu Kaavalenu Teaser: టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య(Naga Shourya) తాజాగా నటిస్తున్న చిత్రం '‘వరుడు కావలెను'’. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ(Reetu Varma) హీరోయిన్‌గా నటిస్తున్నారు. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, టీజర్‌తో పాటు పాటలకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

‘చలో’ సినిమా తర్వాత సరైన హిట్ అందుకోలేకపోయిన నాగశౌర్య(Naga Shourya).. ‘వరుడు కావలెను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హీరోయిన్ రీతూ వర్మ(Reetu Varma) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలోని ‘‘దిగు దిగు నాగా..’’ సాంగ్ వివాదంలో చిక్కుకోవడంతో ఈ చిత్రానికి ఫ్రీ పబ్లిసిటీ కూడా లభించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగాయి.

Also Read: బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్‏లో కొత్త పేర్లు..! ఇక ఎవరెవరూ ఉండబోతున్నారంటే..!

తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమి(Srikrishna Janmashtami)ని పురస్కరించుకొని ఈ చిత్రం నుంచి టీజర్‌(Teaser)ను విడుదల చేసింది చిత్ర బృందం. టామ్‌ అండ్‌ జెర్రీలా నిత్యం గొడవపడే ఓ యువతి, యువకుడి మధ్య ప్రేమ ఎలా పుట్టిందనేదే ఈ మూవీ నేపథ్యం అని టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. ‘అమ్మా.. వీళ్లెవరు నాకు కనెక్ట్‌ అవ్వట్లేదే’, ఆ అందం.. పొగరు.. ఆర్డర్‌ ఇచ్చి చేయించినట్టు ఉంటుంది. ‘ఎవ్రీ బాల్‌ సిక్స్‌ కొట్టే బ్యాట్‌మెన్‌ చూశావా.. మా వాడు కొడతాడు.. ప్రతి బాల్‌ నోబాల్‌ అని ఇచ్చే  అంపైర్‌ని చూశావా.. ఆవిడ ఇస్తది’ లాంటి డైలాగ్స్‌ యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి.  యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రం విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x