AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కేసులు ఒక్కసారిగా తగ్గాయి. గత కొద్దిరోజులుగా స్వల్పంగా పెరుగుతూ వచ్చిన కేసులు గత 24 గంటల్లో గణనీయంగా తగ్గాయి.
కరోనా మహమ్మారి(Corona Pandemic) దేశవ్యాప్తంగా క్రమంగా మరోసారి పంజా విసురుతోంది. ఇటు ఏపీలో కూడా గత కొద్దిరోజులుగా స్వల్పంగా కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. గత 24 గంటల్లో ఏపీలో 41 వేల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..కేవలం 878 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. గత 24 గంటల్లో కోవిడ్ బారినపడి 13 మంది మరణించగా..మొత్తం మరణాల సంఖ్య 13 వేల 838కు చేరుకుంది. గత 24 గంటల్లో ఏపీలో 1182 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ 19 లక్షల 84 వేల 301 మంది కోలుకోగా..ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల 862 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటి వరకూ 20 లక్షల 13 వేలకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల 65 లక్షల 76 వేల 995 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) నిర్వహించారు.
Also read: Kaun Banega Crorepati: కేబీసీ సీజన్ 13 లో పాల్గొన్నందుకు ఆ అధికారిపై ఛార్జిషీటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook