Good News for Telangana Inter Students: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌లో కనీస పాస్ మార్కులు తెచ్చుకున్నవారిని ఎంసెట్ ర్యాంకులకు అర్హులుగా ప్రకటించాలని నిర్ణయించింది. దీంతో ఈ ఏడాది ఇంటర్ సెకండియర్ పరీక్ష రాసే విద్యార్థులందరికీ ఎంసెట్‌కు అర్హత లభించనుంది. తాజా నిర్ణయాన్ని ఉన్నత విద్యా మండలి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా ఇంటర్మీడియట్‌లో కనీసం 40 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులకే ఎంసెట్‌లో ర్యాంకులు కేటాయిస్తారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిబంధనను సడలించారు. కరోనా కారణంగా పదో తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఇంటర్ ఫస్టియర్‌కు ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్‌లోనూ వీరికి పరీక్షలు నిర్వహించకుండానే కనీస మార్కులతో సెకండియర్‌కు ప్రమోట్ చేశారు. 


కరోనా తగ్గుముఖం పట్టాక గతేడాది అక్టోబర్‌లో ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. కేవలం 49 శాతం మంది విద్యార్థులే పాస్ అయ్యారు.దీంతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. కరోనా కారణంగా నిర్వహించిన ఆన్‌లైన్ క్లాసులు సరిగా అర్థం కాక పరీక్షల్లో రాణించలేకపోయామని విద్యార్థులు వాపోయారు.  దీంతో ఫస్టియర్ విద్యార్థులందరినీ ప్రభుత్వం కనీస మార్కులతో పాస్ చేసింది. ఈ ఏడాది వీరు సెకండియర్ పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే ఫస్టియర్ అనుభవాల నేపథ్యంలో ఈసారి కూడా ఎక్కువమంది విద్యార్థులు 40 మార్కులు సాధించడం కష్టమనే వాదన వినిపిస్తోంది.


ఈ నేపథ్యంలో కనీస మార్కులు 35తో పాసయ్యేవారిని ఎంసెట్ ర్యాంకులకు అర్హులుగా ప్రకటించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇక ఈ ఏడాది ఎంసెట్ 2022 పరీక్ష నిర్వహణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 7న జరిగే సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. జూన్ మొదటి వారంలో ఎంసెట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు  ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు, సెకండియర్ పరీక్షలు ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు జరగనున్న సంగతి తెలిసిందే.


Also Read: Next Covid Variant: కోవిడ్ తదుపరి వేరియంట్ జంతువుల నుంచి..? సైంటిస్టుల హెచ్చరిక..


Also Read: MS Dhoni: బస్సు డ్రైవర్‌గా మారిన ఎంఎస్ ధోనీ.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి మరీ దూసుకెళ్లాడు (వీడియో)!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook