Mahmood Ali on Rape Case: తెలంగాణలో జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కీలక నిందితులను తప్పించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార అండతో కేసు తారుమారు చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ స్పందించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈకేసులో నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవన్నారు. గ్యాంగ్ రేప్ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతోందని హోంమంత్రి మహమూద్‌ అలీ చెప్పారు. పోలీసులపై ప్రభుత్వం ఒత్తిడి లేదన్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు అన్నివిధాలుగా అండగా ఉంటామని తేల్చి చెప్పారు. ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశామని..ఇది ప్రభుత్వ పని తీరును నిదర్శనమన్నారు.


తమను అభాసుపాలు చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్‌ వన్‌గా ఉన్నారని గుర్తు చేశారు. ఇదే వారి పనితీరుకు నిదర్శమన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ఇది బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వారి పరివర్తనలో మార్పులు వచ్చాయన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు హోంమంత్రి.


Also read: Pawan Comments on 10th Results: ఏపీలో పది ఫలితాలపై దుమారం..పవన్ కళ్యాణ్‌ ఏమన్నారంటే..!


Also read:America Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పుల మోత..ఆరుగురు మృతి..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి