Pawan Comments on 10th Results: ఏపీలో పది ఫలితాలపై దుమారం..పవన్ కళ్యాణ్‌ ఏమన్నారంటే..!

Pawan Comments on 10th Results: ఏపీలో పదో తరగతి ఫలితాలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ప్రభుత్వ విధానాల వల్లే చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని విపక్షాలు మండిపడుతున్నాయి. కరోనా పరిస్థితుల వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయని..అది ప్రభుత్వ తప్పు ఎలా అవుతుందని వైసీపీ కౌంటర్ ఇస్తోంది.

Written by - Alla Swamy | Last Updated : Jun 8, 2022, 04:51 PM IST
  • పదో తరగతి ఫలితాలపై రాజకీయ దుమారం
  • అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం
  • తాజాగా పవన్‌ కళ్యాణ్‌ విసుర్లు
Pawan Comments on 10th Results: ఏపీలో పది ఫలితాలపై దుమారం..పవన్ కళ్యాణ్‌ ఏమన్నారంటే..!

Pawan Comments on 10th results: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 67 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అప్పటి నుంచి అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లే విద్యార్థులు నష్టపోయారని విమర్శించారు. ఇంట్లో తల్లిదండ్రులదే తప్పు అంటూ వాళ్లపై నెపం వేస్తారా అని ప్రశ్నించారు.

ఈమేరకు ఓ ప్రకటనలో ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యా వ్యవస్థలో సరైన విధానాలను అవలంభించకపోవడంతోనే ఇలాంటి ఫలితాలు వచ్చాయన్నారు. పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమంతో రంగులు వేస్తాం..ఇంగ్లీష్‌ పాఠాలు చెప్పేస్తామంటే సరిపోదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాడు-నేడు కార్యక్రమానికి రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అంటున్నారు. ఫలితాలు చూస్తుంటే ఆ డబ్బులు ఎటు వెళ్లాయని అనిపిస్తోందన్నారు.

సరైనా ఉపాధ్యాయుడు ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదికాదని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా రాలేదన్నారు. విద్యా వేత్తలు, నిపుణులు సూచనలను పరిగణలోకి తీసుకుని విద్యా ప్రణాళిక తయారు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులతో అనవసర పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. వీటి వల్ల విద్యార్థులకు పాఠాలు చెప్పే సమయం ఉండటం లేదన్నారు.

ఫలితాల కోసం రీవాల్యూయేషన్‌కు రూ.500 కట్టాలని అనడం ఏంటని ప్రశ్నించారు. దీంతో మరో దోపిడీకి తెరతీశారని ఫైర్ అయ్యారు. పరీక్ష తప్పిన విద్యార్థుల మానసిక స్థితి, వారి భవిష్యత్తును పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఫెయిల్ అయిన వారికి మంచి మార్కులు ఇచ్చి మంచి భవిష్యత్‌ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉచితంగా రీకౌంటింగ్ చేపట్టాలన్నారు పవన్ కళ్యాణ్.

Also read: CM Jagan on 2024 Elections: మళ్లీ మన ప్రభుత్వే రాబోయేది..నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం..!

Also read:Mithali Raj Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్.. త్వరలోనే రెండో ఇన్నింగ్స్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 

Trending News