Telangana in Davos: కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి తొలిసారి సీఎం స్థాయిలో చేపట్టిన దావోస్ పర్యటన అత్యంత విజయవంతమైంది. రెండు రోజుల పాటు సదస్సులో పాల్గొని ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆకర్షించారు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న సౌకర్యాలు, కల్పిస్తున్న రాయితీలు వివరించి పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు చేపట్టారు. ఫలితంగా దావోస్‌లో తెలంగాణ రూ.40,232 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఈ మేరకు ఆయా కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గతేడాది దావోస్‌లో సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు విశేషం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదానీ గ్రూప్, జేఎస్ డబ్ల్యూ, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, బీఎల్ ఆగ్రో, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్‌  తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ మేరకు రాష్ట్ర బృందంతో ఆయా కంపెనీల ప్రతినిధులు ఒప్పందాలు చేసుకున్నారు. పెట్టుబడులతో తెలంగాణలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలంగాణ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. 


దావోస్‌ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ ఫోరమ్‌లలో మాట్లాడారు. చిన్న, సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు సీఎం పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని కోరారు. అదే వేదికగా జరిగిన మరో సదస్సులో ఆయన మాట్లాడుతూ..'హైదరాబాద్‌ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్‌ను  సాఫ్ట్‌వేర్‌తో సమ్మిళితం చేయాలి. ఖరీదైన హెల్త్ కేర్ సేవల ఖర్చులను తగ్గించేందుకు  అమెరికా, యూరప్ దేశాలు పని చేస్తున్నాయి. హెల్త్ కేర్ సేవలను అందరికీ అందుబాటులో ఉంచేందుకు, అధునాతన వైద్య సేవలను  ప్రతి మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరుకోవడానికి డిజిటల్, సాంకేతికను ఉపయోగించాలి' అని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.


తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక చర్యలను దావోస్‌ వేదికగా భారతీయ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ బిజినెస్ లీడర్లందరూ కొనియాడారు. కొత్త ప్రభుత్వం అనుసరించిన వ్యాపారం, స్నేహ దృక్పథానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. 'దావోస్‌కు రావడం.. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలను కలుసుకోవడం సంతోషంగా ఉంది' అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు, వృద్ధి కలిసి రావాలి. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు నిరంతరం మా ప్రయత్నం కొనసాగుతుంది. పారిశ్రామికవేత్తలందరూ హైదరాబాద్‌కు రావాలి' అని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.


Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌


Also Read: Boat Accident: గుజరాత్‌లో ఘోర పడవ ప్రమాదం 16 మంది మృతి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter