Huzurabad MLA Padi Kaushik Reddy Mass Warning To CM Revanth Reddy: లోక్ సభ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలయ్యాక తెలంగాణలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ఇప్పటికే తెలంగాణలోని బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. నిన్న (ఆదివారం) చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతబాద్ ఎమ్మెల్యే  దానం నాగేందర్ కాంగ్రెస్ లో పార్టీలో చేరడం తీవ్ర చర్చనీయాశంగా మారింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా.. వంద రోజుల తర్వాత అసలైన పాలిటిక్స్ ఏంటో చూపిస్తానంటూ వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ విడుదలయ్యాక.. గేట్లు తెరిచానని, అనేక మంది నేతలు కాంగ్రెస్ లోకి వస్తారంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బీఆర్ఎస్ కు  చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతబాద్ ఎమ్మెల్యే  దానం నాగేందర్ కాంగ్రెలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అదేవిధంగా తమ పార్టీ మీద గుర్తుమీద గెలిచి.. ఇలా ఫిరాయించడమేంటని ప్రశ్నించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై ఫిరాయింపుల చర్యలు తీసుకొవాలని, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు వినతి పత్రం ఇచ్చారు. 


గతంలో రేవంత్ రెడ్డి కొన్ని సందర్బాలలో ఫిరాయింపులకు పాల్పడిన వారిని ఊరితీయాలంటూ కూడ వ్యాఖ్యలుచేశారని కౌశిక్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీని చూసి.. సీఎం రేవంత్ రెడ్డి బాగా నవ్వుకుంటున్నాడని, సింహాం ఒక అడుగు వెనక్కు వేస్తే నాలుగడుగులు ముందుకు వేస్తుందన్నారు. సీఎం రేవంత్ పై వ్యాఖ్యలు చేస్తూ.. నువ్వు కొట్టినవ్ మేము తీసుకున్నాం.. మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా అయితవ్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు.


Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..


సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదయ్యాక తెలంగాణాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.  ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీలలోకి చేరుతున్నారు.  రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అంతా ఖాళీగా మారుతుందని కేవలం నలుగురు మాత్రమే ఉండోచ్చంటూ కూడా కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook