TSRTC: ఆర్టీసీ కండక్టర్ ను కాలితో తన్నుతూ దాడి.. యువతిని అరెస్టు చేసిన పోలీసులు.. డిటెయిల్స్ ఇవే..
Rachakonda Police: హైదరాబాద్ లోని హయత్నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఇటీవల నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన ఘటన తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఘటనపై ఆరా తీశారు.
Sayyad Samina Arrested: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆరు గ్యారంటీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుంది. అయితే.. కొన్ని చోట్ల మహిళలు రద్దీలో సీటు దొరక్క కొట్టుకుంటున్నారు. ఇంకొన్ని చోట్ల కొందరు మహిళలు తాగి, ఏకంగా కండక్టర్ తోనే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, అంబర్ పేట్ కు చెందిన సయ్యద్ సమీనా ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. హయత్ నగర్ లో ఇద్దరు కండక్టర్ లపై దాడిచేస్తు నానా రచ్చ చేసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.
ఈ వ్యవహరంలో.. నిందితురాలైన అంబర్ పేటకు చెందిన సయ్యద్ సమీనాను రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కోర్టులో హజరుపర్చిన నిందితురాలికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ కేసు విచారణను త్వరతగతిన చేపట్టి.. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈక్రమంలో సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించిన లేదా ఎవరైన దాడులకు పాల్పడిన యాజమాన్యం ఏమాత్రం సహించదని స్పష్టం చేశారు.
Read More: Millets Adai Recipe: దోశ తిని తిని బోర్ కొడుతుందా..కేవలం 5 నిమిషాల్లో రెడీ చేసుకునే "అడై" మీ కోసం..
బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. పోలీస్ శాఖ సహకారంతో నేరస్తులపై హిస్టరీ షీట్స్ తెరిచేలా సంస్థ చర్యలు తీసుకుంటుందన్నారు. 45 వేల మంది టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు మనోవేదనకు గురిచేసే ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అంతే కాకుండా.. క్షణికావేశంలో సహనం కోల్పోయి దాడులు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని సజ్జనార్ ప్రజలకు సూచించారు.