Girl Morphing IAS Faculty Family Photos: కొందరు సమాజంలో యువత ఉన్నతమైన ఆశయాలు పెట్టుకుంటారు. కానీ కొన్నిసార్లు అది సాధించే క్రమంలో మరీ ఏజ్ ఎఫెక్ట్ వల్లనో, సినిమాలో ప్రభావం వల్లనో వచ్చిన పని మర్చిపోయి తప్పుడు పనులు చేస్తుంటారు. అచ్చం ఇలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో జరిగింది. ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: BP Warnings and Signs: రాత్రి వేళ నిద్రించేటప్పుడు బీపీ పెరిగితే ప్రాణాలు పోతాయా, ఏం చేయాలి


అనంతపురం కు చెందిన యువతి గ్రూప్ 1 కోసం హైదరాబాద్ లోని అశోక్ నగర్ కు వచ్చి మంచి ఐఏఎస్ ఇన్ స్టిట్యూట్ లో జాయిన్ అయ్యింది. ఇంతవరకు బాగానే ఉంది. ఫ్యాకల్టీలు చెప్పిన క్లాసులు చక్కగా విని ఎగ్జామ్ లకు ప్రిపేర్ కావాల్సింది పోయి, ఒక యువతి క్లాసులు చెబుతున్న మాస్టర్ నే ప్రేమించింది.


అంతేకాకుండా.. ఏకంగా ఆయన దగ్గరికే వెళ్లి ప్రేమిస్తున్నట్లు కూడా చెప్పింది. ఆయన దీన్ని తిరస్కరించి తనకు అప్పటికే పెళ్లియిందని, పిల్లలున్నారని మందలించాడు. దీంతో అప్పటి నుంచి ఆమె ఫ్యాకల్టీపై కోపం పెంచుకుంది. బిచ్చగాడు పేరుతో సిమ్ కార్డు కొని, సదరు ఫ్యాకల్టీ కుటుంబం ఫోటోలను ఇన్ స్టా నుంచి సేకరించింది. వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా అనేక రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో షేర్ చేసింది.


Read More: Ariyana Glory: నేచర్ లో అందాల అరబోస్తూ రచ్చ చేస్తున్న అరియానా, ఫిక్స్ వైరల్


ఇది కాస్త ఫ్యాకల్టీ బంధువులకు తెలియడంతో , బాధితుడి వరకు వెళ్లింది. వెంటనే ఆయన సైబర్ క్రైమ్  పోలీసులను ఆశ్రయించాడు.  ఈక్రమంలో పోలీసులు విచారణలో సదరు 24 ఏళ్ల యువతి ఈ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఫెస్ బుక్ లు, ఇన్ స్టాలలో నకిలీ ఖాతాలను తెరిచి, ఫ్యాకల్టీ భార్య, కూతురు చిత్రాలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసినట్లు బైటపడింది. దీంతో పోలీసులు ఫ్యాకల్టీ ఫిర్యాదు మేరకు,  ఆమెను అరెస్టుచేసి పీఎస్ కు తరలించారు. కోర్టులో హజరు పరచగా జ్యూడిషియల్ రిమాండ్ కు ఆదేశిస్తు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ ఘటన అశోక్ నగర్ లో తీవ్ర దుమారంగా మారింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook