Kumari Aunty: అక్కా.. మా గోడు సీఎం రేవంత్ కు చెప్పు.. కుమారి ఆంటీ స్టాల్ ఎదుట నిరుద్యోగుల నిరసన..
Unemplyed Youth Protest: కుమారి ఆంటీ స్టాల్ దగ్గరకు నిరుద్యోగులు భారీగా చేరుకున్నారు. ఉద్యోగ ప్రకటనలు వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి తమకు న్యాయం చేయాలని నిరుద్యోగులు ఆమెను చుట్టుముట్టారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
CM Revanth Reddy: సోషల్ మీడియా, యూట్యూబర్ ల వల్ల ఓవన్ నైట్ లో ఫెమస్ అయి పోయిన కుమారి ఆంటీ ప్రస్తుతం మరోసారి వార్తలలో నిలిచింది. ఇప్పటికే తన ఫుడ్ స్టాల్ ద్వారా కస్టమర్లకు మంచి రుచికరమైన ఫుడ్ అందిస్తుంది. ఈ క్రమంలో రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు స్టాల్ ను తీసేయాలని కూడా ఆమెకు సూచించారు. దీంతో ఆమె తన బాధను సోషల్ మీడియా మాధ్యమంగా రిక్వెస్ట్ చేసింది.
Read Also: Poonam Pandey: మేము హర్ట్ అయ్యాం.. నటి పూనమ్ పాండేపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..
ఈ క్రమంలో ఆమె సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో పడింది. కుమారి ఆంటీ స్టాల్ అక్కడి నిర్వహించుకోవాలని ఆమెకు ఇబ్బంది కల్గజేయద్దని పోలీసులకు ఆదేశించారు అదే విధంగా ఒకసారి వచ్చి ఆమె స్టాల్ లో ఫుడ్ కూడా టెస్ట్ చేస్తానని ఏకంగా సీఎం బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీంతో ఆమె ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది. ఆమెను కొందరు బిగ్ బాస్ కు పంపాలని, మరికొందరు మాత్రం ఆమెను స్టార్ క్యాంపెయినర్ గా పాలిటిక్స్ లో కూడా సేవలు ఉపయోగించుకోవచ్చని కూడా ప్రచారం చేశారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కొందరు నిరుద్యోగులు ఆమె దగ్గరకు వెళ్లి తీవ్ర గందర గోళం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆమె దగ్గరకు వస్తే .. తమ ప్రభుత్వ ఉద్యోగుల విషయం మాట్లాడాలని ఆమెను కోరారు. అంతే కాకుండా వందలాది మంది ఆమెను చుట్టుముట్టి జీవో నంబర్ 46 రద్దు చేయాలని కూడా సీఎంతో చెప్పండి అక్క అంటూ ఆమె చేతికి వినతి పత్రాలు ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడ ఒకింత గందర గోళం తలెత్తింది.
Read Also: White Hair Problem: తెల్ల వెంట్రుకలు నల్ల బడేందుకు అద్భుతమైన చిట్కా, ఆ రెండు వస్తువులు కలిపితే చాలు
కుమారి ఆంటీ మాట్లాడుతూ.. సీఎం మన సమస్యలు పరిష్కారిస్తారని, ఇలా రోడ్డుమీద గుమిగూడితే ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, మన వల్ల ఇతరులకు ఇబ్బంది కల్గకూడదని కుమారి ఆంటీ నిరుద్యోగులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఒక వైపు నిరుద్యోగులు, మరోవైపు అనేక మంది యూట్యూబర్ లు ఆమెను చుట్టుముట్టి గట్టిగా అరుస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రంసోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook