Telangana IAS Officers Transfers: తెలంగాణలో రేవంత్‌ సర్కార్‌ ఏర్పడినప్పటి నుంచి తనదైన ముద్రను వేసుకుంటున్నారు. తాజాగా మరోసారి భారీ ఎత్తున అధికారులను బదిలీ చేశారు. అనుభవం ఉన్న అధికారులకు పట్టం కట్టారు. దీపావళి పండుగ ముందు భారీ ఎత్తున ఆఫీసర్ల బదిలీ చేపట్టింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఇప్పటికే అమ్రాపాలీని, రోనాల్డ్ రాస్ ఇతర కీలక అధికారులను ఏపీ కేటాయించారు. ఈ సందర్భంగా మరోసారి ఏకంగా ఒకేసారి 87 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. నారాయణ రెడ్డి గతంలో నల్గొం కలెక్టర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆయన్ను కే శశాంక్ స్థానంలో రంగారెడ్డి కలెక్టర్‌గా నియమించారు. ఐలా త్రిపాఠి టూరిజం శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన్ను నల్గొండ కొత్త కలెక్టర్‌గా నియమించారు. గతంలో ఇక్కడ నారాయణ రెడ్డి పనిచేశారు.
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎం హనుమంతరావు ఐ అండ్‌ పీఆర్‌ స్పెషల్‌ కమిషనర్‌ యాదాద్రి భువనిగిరి కొత్త కలెక్టర్‌గా నియమించారు. గతంలో ఇక్కడ హనుమంత్‌ కే పనిచేశారు. ఇక మరో మహిళ ఆఫీసర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ డేరింగ్‌ లేడీ డాక్టర్‌ టీకే శ్రీదేవి కమిషనర్‌, ఎస్‌సీడీ గా పనిచేస్తున్న ఆమెను మున్సిపల్‌ డైరెక్టర్‌, కమిషనర్‌గా కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ పోస్టులో గతంలో వీపీ గౌతమ్‌ పనిచేశారు.


జీఓ నంబర్‌ 392 ను జారీ చేస్తూ దాదాపు 70 మందికి పైగా అధికారులను బదిలీలు చేపట్టారు. వీరు కాకుండా 13 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పుట్టినరోజు ఇంతర మంది అధికారులను బదిలీ చేయడం గమనార్హం. 


ఇదీ చదవండి : అరెరే..జగన్, షర్మిళ ఉదంతం అచ్చం బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమాను  తలపిస్తుందే..


డేరింగ్‌ లేడీ శ్రీదేవి మాత్రం ఇందులో ప్రత్యేకం ఎందుకంటే ఈమె గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పనిచేశారు. ఆ తర్వాత ఆమెను ఎన్నికల సంఘం వేటు వేసింది. అప్పట్లో సోషల్‌ మీడియా వేదికగా ఆమె వేటును ఖండించారు. శ్రీదేవికి తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం మున్సిపల్‌ శాఖలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఎల్‌ రమేష్‌, ఎన్‌ ఆనంద్‌ కుమార్‌ వీ హనుమంత్‌ నాయక్‌ డిప్యూటీ కలెక్టర్లను రెవెన్యూ శాఖకు బదిలీ చేశారు.


ఇదిలా ఉండగా ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్లు అయిన ఎన్‌ క్షితిజ ఫారెస్ట్‌ కన్సర్వేటర్‌ను షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా బదిలీ చేశారు. వీవీఎల్‌ సుభద్రా దేవి (అర్బన్‌ ఫారెస్ట్రీ) అడిషనల్ కమిషనర్‌గా నియమించారు. సోనీ బాలా దేవి కొర్ర లక్ష్మి స్థానంలో స్పోర్ట్స్‌ ఆథారిటీ ఆఫ్‌ తెలంగాణ ఎండీగా నియమితులయ్యారు. జీ జ్ఞానేశ్వర్‌ అసిస్టెంట్‌ ఫారెస్ట్‌ కన్సర్వేటర్‌ను వికారాబాద్‌ జిల్లా అధికారిగా బదిలీ చేశారు. అనుభవం ఉన్న అధికారులను వివిధ జిల్లాలకు, కీలక బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు సీఎస్‌ శాంతి కుమారీ ఉత్తర్వులు సోమవారం జారీ చేశారు.


ఇదీ చదవండి : పవన్ కళ్యాణ్ బాటలో విజయ్ రాజకీయం..


 



 


 




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి