Inter Exams Schedule: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, ఎప్పట్నించి ఎప్పటి వరకంటే
Inter Exams Schedule: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలు మార్చ్ 5 నుంచి 20 వరకూ జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన టైమ్ టేబుల్ వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Inter Exams Schedule: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల టైమ్ టేబుల్ వచ్చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చ్ 5 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చ్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి.
తెలంగాణలో ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చ్ 5 నుంచి మార్చ్ 15 వరకూ జరగనుండగా రెండో ఏడాది పరీక్షలు మార్చ్ 6 నుంచి 20 వరకూ జరుగుతాయి. ఇక ప్రాక్టికల్స్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి 22 వరకూ ఉంటాయి. అంతకంటే ముందు జనవరి 29వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఉంటుంది. జనవరి 30వ తేదీన ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ పరీక్ష ఉంటుంది.
తెలంగాణ ఇంటర్ పరీక్షల మొదటి ఏడాది షెడ్యూల్
మార్చ్ 5 సెకండ్ లాంగ్వేజ్
మార్చ్ 7 ఇంగ్లీష్
మార్చ్ 11 మేథ్స్ పేపర్ 1ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్
మార్చ్ 13 మేథ్స్ పేపర్ 1బి, జువాలజీ, హిస్టరీ
మార్చ్ 17 ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చ్ 19 కెమిస్ట్రీ, కామర్స్
తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం షెడ్యూల్
మార్చ్ 6 సెకంండ్ లాంగ్వేజ్
మార్చ్ 10 ఇంగ్లీష్
మార్చ్ 12 మేథ్స్ పేపర్ 2ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్
మార్చ్ 15 మేధ్స్ పేపర్ 2బి, జువాలజీ, హిస్టరీ
మార్చ్ 18 ఫిజిక్స్, ఎకనామిక్స్
మార్చ్ 20 కెమిస్ట్రీ, కామర్స్
Also read: Vitamin D Supplements: విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఎంతకాలం తీసుకోవాలి, బెస్ట్ డైట్ ఏంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.