Telangana Inter board: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ విడుదల..విద్యార్థుల అలర్ట్..!
Telangana Inter board: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైంటేబుల్ విడుదల అయ్యింది.
Telangana Inter board: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైంటేబుల్ విడుదల అయ్యింది. తెలంగాణ ఇంటర్మీయట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి 10 వరకు జరగనున్నాయి. ఈమేరకు ఇంటర్ బోర్డు అధికారిక ప్రకటను వెలువరించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. దీనిని విద్యార్థులంతా గమనించాలని ఇంటర్ బోర్డు పేర్కొంది.
మంగళవారం ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో మొదటి సంవత్సరం 63.32 శాతం, సెకండియర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. మొత్తం 9 లక్షల 28 వేల 262 మంది పరీక్షలు రాశారు. ఇందులో ఫస్టియర్‌లో 2 లక్షల 94 వేల 378 మంది, సెకండియర్‌లో 4 లక్షల 63 వేల 370 మంది పాస్ అయ్యారు. ఆగస్టు 1 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
Also read: Corona Updates in Telangana: తెలంగాణలో ఫోర్త్ వేవ్ బెల్స్..పెరుగుతున్న రోజువారి కేసులు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.