TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల తేదీని రాష్ట్ర విద్యా శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నామని తెలిపింది. ఫలితాలు చెక్ చేసుకునే క్రమంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ అన్ని జాగ్రత్తలు చేపట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 19 వరకూ జరిగాయి. ఆ తరువాత పరీక్షా పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 9 లక్షల 80 వేల 978 మంది ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. ఆన్‌లైన్ మార్కుల నమోదు, కోడింగ్, డీ కోడింగ్ ప్రక్రియ పూర్తయింది. పరీక్ష పత్రాల్ని మూడేసి సార్లు పరిశీలించారు.  గత ఏడాది తెలంగాణలో ఇంటర్ ఫలితాలు మే 9వ తేదీన విడుదల కాగా ఈసారి అంతకంటే ముందే ఏప్రిల్ 24వ తేదీన విడుదల చేస్తోంది. ఇటు పరీక్షలు కూడా గత ఏడాదితో పోలిస్తే 15-20 రోజులు ముందే పూర్తయ్యాయి. ఇదే తేదీల్లో ఏపీలో ఇంటర్ పరీక్షలు పూర్తయి పది రోజుల క్రితం ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఇప్పుడిక తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. 


ఏప్రిల్ 12న ఏపీలో ఇంటర్ ఫలితాలు వెల్లడి కాగా ఏప్రిల్ 22వ తేదీ సోమవారం పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 24న విడుదల కానుండగా, పదో తరగతి పరీక్ష ఫలితాలను కూడా అదే వారంలో విడుదల చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమౌతోంది. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే సమయంలో జరిగాయి. 


తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.inలో చెక్ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. 


Also read: CM Revanth Reddy: రేవంత్ బలహీనమైన సీఎం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook