TS Inter & SSC Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 24న, పదో తరగతి ఫలితాలు 30న, ఎలా చెక్ చేసుకోవాలంటే
TS Inter & SSC Results: తెలంగాణ ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్ష ఫలితాలపై క్లారిటీ వచ్చింది. రెండింటి ఫలితాలు ఎప్పుడు వెల్లడయ్యేది తేదీ వచ్చేసింది. ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి, ఇతర వివరాలు తెలుసుకుందాం.
TS Inter & SSC Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలై పదిరోజులైంది. ఇవాళ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలవుతున్నాయి. ఇక తెలంగాణ కూడా ఇంటర్ ,పదో తరగతి పరీక్ష ఫలితాలు తేదీ నిర్ణయించింది. వారం రోజుల వ్యవధిలో రెండు పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి.
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 18 వరకూ జరిగాయి. మొత్తం 9.80 లక్షలమంది విద్యార్ధులు ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు. మార్చ్ 16న ప్రారంభమైన పరీక్ష పత్రాల మూల్యాంకనం ఇతర ప్రక్రియలు ఏప్రిల్ మొదటి వారంలో ముగిశాయి. ఎన్నికల సంఘం అనుమతి కోసం నిరీక్షించిన తెలంగాణ విద్యాశాఖ అనుమతి లబించడంతో ఇవాళ విడుదల చేయాలని భావించింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఏప్రిల్ 23 మంగళవారం సెంటిమెంట్ అడ్డొచ్చినందున ఏప్రిల్ 24వ తేదీ బుధవారం ఫలితాలు విడుదల చేస్తోంది.
ఇంటర్మీడియట్ విద్యార్ధులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.inలో చెక్ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.
పదో తరగతి ఫలితాలు
మరోవైపు పదో తరగతి పరీక్షఫలితాలు వెల్లడి చేసేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చ్ 18 నుంచి 31 వరకూ తెలంగాణ పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5.08 లక్షలమంది విద్యార్ధుల పరీక్షలు రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 17 కేంద్రాల్లో పరీక్ష పత్రాల వాల్యుయేషన్ జరిగింది. ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. కోడింగ్, డీ కోడింగ్ ప్రక్రియ పూర్తి కావస్తోంది. మరోవైపు ఎన్నికల సంఘం అనుమతి కోసం నిరీక్షిస్తున్నారు. అనుమతి రాగానే ఏప్రిల్ 30న పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పదవ తరగతి ఫలితాలను tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in. వెబ్‌సైట్ ద్వారా నేరుగా తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.
Also read: AP SSC Results 2024: ఇవాళే పదో తరగతి ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook