Minister KTR Writes Letter to Central Govt: హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ ప్రస్తుత తరుణంలో సాధ్యం కాదంటూ కేంద్రం చెప్పడంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి ఘాటు లేఖ రాశారు. అత్యంత రద్దీ కలిగిన హైదరాబాద్‌లో మెట్రో రైల్ ప్రాజెక్టు రెండవ దశ సాధ్యం కాదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన నగరాలకు మాత్రం పక్షపాత ధోరణితో మెట్రో రైల్ ప్రాజెక్టులు ఇస్తోందని ఫైర్ అయ్యారు. గాంధీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతోపాటు చాలా తక్కువ జనాభా కలిగిన లక్నో, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్రాజ్, మీరట్ వంటి ఉత్తరప్రదేశ్ లోని చిన్న పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులను కేంద్రం కేటాయించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. జనాభా రద్దీ తక్కువగా ఉన్న ఇలాంటి నగరాలకు మెట్రో రైల్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్న కేంద్రం.. హైదరాబాద్ నగరానికి మాత్రం మెట్రో రైల్ విస్తరణ అర్హత లేదని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరప్రదేశ్‌లోని  అనేక చిన్న నగరాలు, పట్టణాలు మెట్రో రైల్ ప్రాజెక్టులకి అర్హత సాధించినప్పుడు హైదరాబాద్ మెట్రో నగరానికి మాత్రం ఎందుకు ఆ అర్హత పొందదని కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో తెలంగాణతో పోల్చుకుంటే ఎలాంటి అర్హతలు లేకున్నా ఇతర పట్టణాలకు, రాష్ట్రాలకు ప్రాజెక్టులను కట్టబెడుతూ తెలంగాణకు పదేపదే కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. ఇది కచ్చితంగా తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ నగరం పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న పక్షపాత దృక్పథమేనని, కేంద్రానిది సవతి తల్లి ప్రేమ అని కేటీఆర్ ఘాటుగా స్పందించారు. 


ఇప్పటికే అనేకసార్లు కేంద్ర ప్రభుత్వ పట్టణ అభివృద్ధి శాఖకు మెట్రో రైల్ రెండవ దశకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని అందించడంతోపాటు డీటెయిల్డ్ ప్లానింగ్ రిపోర్ట్ (డీపీఆర్) సైతం అందించామన్నారు కేటీఆర్. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ, పీహెచ్‌పీడీటీ గణాంకాలు, ఇతర అర్హతలను, సానుకూలతలను అనేకసార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామన్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ మున్సిపల్ శాఖ తరపున గతంలో అందించిన సమాచారం తాలూకు నివేదికలను లేఖకు జతచేశారు. 


కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరిని వ్యక్తిగతంగా కలిసి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండవ దశ ప్రాధాన్యతను వివరించేందుకు తాను స్వయంగా అనేకసార్లు ప్రయత్నించినా.. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదని కేటీఆర్ అన్నారు. అయితే కేంద్రమంత్రి హరదీప్ సింగ్ పూరి నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పట్టణాభివృద్ధి శాఖ హైదరాబాద్ నగర మౌలిక వసతుల ప్రాజెక్టులు విషయంలో ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా, అవసరాలే ప్రాతిపదికగా సరైన నిర్ణయం తీసుకొని తెలంగాణకు ప్రాజెక్టులు కేటాయిస్తారని ఆశించిన్నట్లు తెలిపారు. 


అయినప్పటికీ హైదరాబాద్ నగర మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండవ దశ ప్రతిపాదనలో ఉన్న సానుకూలతలను దృష్టిలో ఉంచుకొని, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేసందుకు, అవసరమైన సమాచారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కేటీఆర్ తన లేఖలో హర్దీప్ సింగ్ పూరికి తెలిపారు.


Also Read: Pan Aadhaar Link: బిగ్ రిలీఫ్.. పాన్-ఆధార్ లింక్ గడువు పొడగింపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..   


Also Read: TSRTC: భద్రాద్రి రాములోరి తలంబ్రాలకు అనూహ్య స్పందన.. రూ.116 చెల్లిస్తే నేరుగా మీ ఇంటికే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి