కేసీఆర్ థార్డ్ ఫ్రంట్ పై కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలకు ఏమీ చేయని కేసీఆర్ దేశానికి ఏం చేస్తారని కోదండరాం ప్రశ్నించారు
హైదరాబాద్: ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన కేసీఆర్ థార్డ్ ఫ్రంట్ పై టి.జేఏసీ ఛైర్మన్ కోదండరాం తనదైన శైలిలో స్పందించారు. ఎన్నో ఆశలతో రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలకు ఏమీ చేయని కేసీఆర్ దేశానికి ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తమకు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వస్తాయని అంతా ఆశించారని..వాటిల్లో ఒక్కటి కూడా నెరవేరలేదని కోదండారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు కేటీఆర్ ను సీఎంను చేయడానికే థార్డ్ ఫ్రంట్ డ్రామా అనికోదండరాం వ్యాఖ్యానించారు. ఓయూలో విద్యార్థి నేతలు నిర్వహించిన ‘మిలియన్ మార్చ్ స్ఫూర్తిని గుర్తుచేసుకుందాం- ఉద్యమ ఆకాంక్షలను సాధిద్దాం’ సదస్సు సందర్భంగా కోదండరాం ఈ వ్యాఖ్యలు చేశారు.
పరిష్మన్ ఇచ్చినా..ఇవ్వకున్నా పోరు ఆగదు
ట్యాంక్ బండ్ పై రేపు నిర్వహించతలపెట్టిన మహాధర్నాపై కోదండరాం స్పందించారు. మిలియన్ మార్చ్ ని గుర్తు చేసుకునేలా ట్యాంక్ బంద్ వద్ద కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అనుమతితో సంబంధనం లేకుండా రేపు ట్యాంక్ బండ్ పై మిలియన్ మార్చ్ ను గుర్తుచేసుకునేలా ఆట, పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని కోదండారం అన్నారు.