Former Brs Mla Thatikonda Rajaiah Resigns: పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బతగిలింది. స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ ను విడుతున్నట్లు ప్రకటించాడు. అదే విధంగా ఈనెల 10 న ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కూడా సమాచారం. కాగా, బీఆర్ఎస్ తనను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీఆర్ఎస్ విధానాల పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో మాదిగల ఆత్మగౌరవం దెబ్బతిందన్నారు. తాను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యానని రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ను కూల్చేస్తామంటూ బీఆర్ఎస్ నేతలు కామెంట్ లు చేయడం ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదన్నారు.


అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను కాదని, కేసీఆర్ కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారన్నారు. తొందరలోనే కార్యకర్తలతో కలసి భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజయ్య కాంగ్రెస్  పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook