Telangana Lok Sabha Poll 2024: తెలంగాణలో జిల్లాల వారీగా పోలింగ్ శాతం.. భువనగరి అత్యధికం.. హైదరాబాద్ అత్యల్పం..
Telangana Lok Sabha Poll 2024: దేశ వ్యాప్తంగా నాల్గో దశలో భాగంగా తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏ నియోజకవర్గాల్లో ఎంత శాతం నమోదు అయిందే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
Telangana Lok Sabha Poll 2024: దేశ వ్యాప్తంగా 543 స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది ఎలక్షన్ కమిషన్. ఈ నేపథ్యంలో 4వ విడతలో భాగంగా తెలంగాణ, ఏపీ సహా 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 96 లోక్ సభ సీట్లకు నిన్నటితో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అక్కడక్కడ కొన్ని చెదురు మొదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగింది. ఇక నాల్గో విడతలో తెలంగాణలోని 17 లోక్ సభ సీట్లకు నిన్న ఎన్నికలు జరిగాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా 64.93 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.
అత్యధికంగా భువనగరిలో 76.47% పోలింగ్ నమోదు అయితే.. అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో 46.08 % నమోదు అయింది.
నియోజకవర్గాలు వారీగా పోలింగ్ శాతం ఎలా ఉందంటే..
ఆదిలాబాద్ 72.96 %
భువనగిరి 76.47 %
చేవెళ్ల 55.45 %
హైదరాబాద్ 46.08 %
కరీంనగర్ 72.33 %
ఖమ్మం 75.19 %
మహబూబాబాద్ 71.54 %
మల్కాజ్‌గిరి 50.12 %
మెదక్ 74.38 %
నాగర్ కర్నూల్ 68.86 %
నల్గొండ 73.78 %
నిజామాబాద్ 71.50 %
పెద్దపల్లి 67.88 %
సికింద్రాబాద్ 48.11 %
వరంగల్ 68.29 %
జహీరాబాద్ 74.54 %
మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా 64.93 % పోలింగ్ నమోదు అయింది. మొత్తంగా చాలా మందికి తెలంగాణలో హైదరాబాద్ లో ఉండే చాలా మంది ప్రజలకు రెండు చోట్ల ఓటర్ ఐడీ కార్డులు ఉన్నాయి. చాలా మంది సొంత ఊళ్లలో ఓట్లు వేయడానికి ఉత్సాహాం చూపించడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల వంటి లోక్ సభ స్థానాల్లో పోలింగ్ తక్కువగా నమోదు అయింది. ఒకవేళ ఓటరు ఐడీకి ఆధార్‌తో అనుసంధానం చేస్తే సరైన పోలింగ్ శాతం వివరాలు నమోదు అయ్యే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో నమోదు అయిన పోలింగ్ బట్టి.. వివిధ పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ పోటీలో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది జూన్ 4న ఎన్నికల ఫలితాల రోజున వెలుబడనుంది.
Also read: AP Repolling: ఏపీలోని ఆ కేంద్రాల్లో రీ పోలింగ్ ఉంటుందా, ఎన్నికల సంఘం ఏం చెప్పింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook