AP Repolling: ఏపీలోని ఆ కేంద్రాల్లో రీ పోలింగ్ ఉంటుందా, ఎన్నికల సంఘం ఏం చెప్పింది

AP Repolling: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. కొన్ని కేంద్రాల్లో హింసాత్మక సంఘటనలు జరగడంతో రీ పోలింగ్ డిమాండ్ విన్పిస్తోంది. మరి ఎన్నికల సంఘం ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 13, 2024, 10:10 PM IST
AP Repolling: ఏపీలోని ఆ కేంద్రాల్లో రీ పోలింగ్ ఉంటుందా, ఎన్నికల సంఘం ఏం చెప్పింది

AP Repolling: ఏపీలో ఇంకా పోలింగ్ జరుగుతోంది. అధికారికంగా 6 గంటలకు పోలింగ్ ముగిసినా కొన్ని నియోజకవర్గాల్లో క్యూలైన్లలో ఓటర్లు బారురు తీరి ఉండటంతో ఓటేసేందుకు అనుమతిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకూ క్యూలైన్లలో ఉన్నవారికి ప్రత్యేకంగా స్లిప్పులిచ్చి ఓటేసేందుకు అనుమతించారు. మరోవైపు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్‌పై ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుందో తెలుసుకుందాం.

ఏపీలో ఇవాళ జరిగిన ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పల్నాడు, రాయలసీమ జిల్లాల్లోనూ, కోస్తాలోని పలు జిల్లాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కార్యకర్తలు, నేతలు బాహాబాహీకు దిగారు. ఈవీఎంలు ధ్వంసం చేశారు. మొత్తం 120 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయని తెలుగుదేశం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే 80 చోట్ల హింస జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఏజెంట్ల కిడ్నాప్ వ్యవహారం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రీ పోలింగ్ నిర్వహించాలనే డిమాండ్ విన్పించింది. అయితే దీనిపై ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా రీ పోలింగ్ నిర్వహించడం లేదన్నారు. 

రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ రాజకీయ పార్టీలు రీ పోలింగ్ కోరలేదని సీఈవో ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. జరిగిన ఘటనల్ని ఎన్నికల సంఘం అంత సీరియస్‌గా తీసుకోలేదు. సాయంత్రం 5 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 68 శాతం పోలింగ్ నమోదైంది. క్యూలైన్లలో నిలుచున్నవారి పోలింగ్ కూడా ముగిస్తే 79-80 శాతానికి చేరుకోవచ్చని తెలుస్తోంది. ఈ పోలింగ్ శాతం ఏ రాజకీయ పార్టీ కొంప ముంచుతుందో చూడాల్సి ఉంది.

Also read: Jagan Tsunami: ఏపీలో అధికారం ఎవరిది, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న జగన్ సునామీ హ్యాష్‌ట్యాగ్

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News