Dental Surgery: కొంప ముంచిన డెంటల్ సర్జరీ.. పెళ్లికి వారంముందు చనిపోయిన యువకుడు.. కారణం ఏంటంటే..?
Hyderabad: లక్ష్మీ నారాయణ అనే యువకుడు డెంటల్ సర్జరీ కోసం జూబ్లీహిల్స్ లోని ఎఫ్‌ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్ కు వెళ్లాడు. అక్కడ `స్మైల్ డిజైనింగ్` ట్రీట్మెంట్ ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడి డెంటల్ వైద్యులు మోతాదుకు మించి అనస్థీషియా ఇచ్చినట్లు తెలుస్తోంది.
Youg Boy Died High Dosage Of Anesthesia Effect: చాలా మంది యువత అందంగా, ఆకర్శనీయంగా ఉండాలనుకుంటారు. దీనిలో భాగంగా కొందరు.. వెంట్రుకలకు, పళ్లకు ట్రీట్మెంట్ లు చేయించుకుంటారు. పళ్లు కొందరికి, ఎత్తుగా ఉంటాయి. పసుపుపచ్చగా ఉంటాయి. కొన్నిసార్లు బైటకు పొడిచి వచ్చినట్లు కూడా ఉంటాయి. ఇందు కోసం, స్పెషల్ గా కాస్మోటిక్స్ వైద్యం చేయించుకుంటారు.
Read More:
కానీ కొన్ని ఆస్పత్రులలో నిపుణులైన డాక్టర్లు ఉండదరు. ఏ మాత్రం అనుభవం లేని డాక్టర్ లతో వైద్యం చేయిస్తుంటారు. ఇలాంటి సమయాలలో కొందరు బాధితులకు ట్రీట్మెంట్ చేసే క్రమంలో అపస్మారకస్థితిలోకి వెళ్లి చనిపోతుంటారు. అచ్చం ఇలాంటి ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
హైదరాబాద్ లో లక్ష్మీ నారాయణ (28) యువకుడికి ఇటీవల పెళ్లి కుదిరింది. అయితే.. అతను కాస్మోటిక్స్ ట్రీట్మెంట్ చేయించుకొవాలని ప్లాన్ చేశాడు. దీని కోసం.. జూబ్లీహిల్స్‌లోని ఎఫ్‌ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్ కు వెళ్లాడు. అక్కడ డెంటల్ వైద్యులు.. 'స్మైల్ డిజైనింగ్' ట్రీట్మెంట్ ప్రారంభించారు. దీనిలో భాగంగా అతనికి.. అనస్థీషియా ఇచ్చారు. యువకుడు ఎంతసేపటికి లేవక పోవడంతో డెంటల్ వైద్యులు, అతని తండ్రికి ఫోన్ చేసి ఆస్పత్రికి పిలిపించారు.
యువకుడి కుటుంబం హుటాహుటీన ఆస్పత్రికి చేరుకుని, లక్ష్మీ నారాయణను మరో ఆస్పత్రికి తరలించారు. అతడిని టెస్ట్ చేసిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. ఫిబ్రవరి 16న ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అనస్థీషియా ఓవర్ డోస్ వల్లే చనిపోయాడని లక్ష్మీనారాయణ తండ్రి రాములు వింజం ఆరోపించారు.
Read More: Nagma: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అలనాటి స్టార్ హీరోయిన్.. ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఇదిలా ఉండగా.. శస్త్రచికిత్స గురించి తన కుమారుడు తమకు తెలియజేయలేదని ఆయన అన్నారు. (అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అతని మరణానికి వైద్యులదే బాధ్యతని వింజమ్ అన్నారు. చనిపోయిన యువకుడి, కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో క్లినిక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రి రికార్డులు, సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook