Harish Rao Counter: కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్  వారు సాగుతోంది. సోషల్ మీడియాలోనూ రెండు పార్టీల నేతల మధ్య రచ్చ నడుస్తోంది. వరంగల్ రైతు సంఘర్షణ సభలో  సీఎం కేసీఆర్ పని తీరు, టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. కేసీఆర్ ను రాజులా అభివర్ణించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి బయటపెడతామని ప్రకటించారు రాహుల్ గాంధీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాహుల్ కామెంట్లపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. రాహుల్ టార్గెట్ గా మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతులు... కాంగ్రెస్ పార్టీని ఈడ్చీ తన్నారని రాహుల్ గాంధీని ఉద్దేశించి హరీష్ రావు ట్వీట్ చేశారు. పంజాబ్ లోనూ కాంగ్రెస్ ఇలాంటే హామీలే ఇచ్చిందన్నారు. పంబాజ్ రైతులు నమ్మని రైతు డిక్లేరేషన్ ను చైతన్యనవంతలైన తెలంగాణ అన్నదాతలు ఎలా విశ్వసిస్తారని రాహుల్ ను ప్రశ్నించారు హరీష్ రావు. వరంగల్ జరిగింది రైతు సంఘర్షణ సభ కాదని.. అది రాహుల్ సంఘర్షణ సభ అని హరీష్ రావు సెటైర్లు వేశారు.




ఎయిర్ పోర్టులో దిగగానే సభలో ఏం మాట్లాడాలని స్థానిక నేతలను అడిగే రాహుల్ గాంధీకి.. తెలంగాణ రైతుల గురించి ఏ తెలుస్తుందని హరీష్ మండిపడ్డారు. రైతుల సంక్షేమం పట్ల రాహుల్ కు ఏ మాత్రం చిత్తశుద్ది లేదన్నారు. తెలంగాణలోని సబ్బండ వర్గాల కోసం ఆలోచించేంది.. వాళ్ల సంక్షేమం కోసం పాటుపడేది టీఆర్ఎస్ పార్టీననే.. తెలంగాణ ప్రజలకు కేసీఆరే శ్రీరామ రక్ష అని హరీష్ రావు స్పష్టం చేశారు.


READ ALSO: Revanth Reddy: రాహుల్ నోట.. రేవంత్ మాట.. ఫైర్ బ్రాండ్ లీడర్ కు ఇక తిరుగే లేదా!  


KTR Counter to Rahul: పొలిటికల్ టూరిస్టులు వస్తారు, పోతారు.. కానీ కేసీఆర్ లోకల్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook