తెలంగాణ ( Telangana ) రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి హరీష్ రావు ( Harish Rao ) కరోనా నుంచి కోలుకున్నారు. కొంత కాలం క్రితం అయనకు కోవిడ్-19  (Covid-19 ) పాజిటీవ్ రాగా వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయనకు కోవిడ్-19 పరీక్షలో నెగెటీవ్ వచ్చినట్టు.. అయన కరోనాపై విజయం సాధించినట్టు వైద్యులు తెలిపారు.



సెప్టెంబర్ 5న తన్నీరు హరీష్ రావుకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా పాజిటీవ్ అని తేలింది.  దాంతో ఆయన హోం ఐసోలేషన్ ఉన్నారు. వైద్యులు రెగ్యులర్ గా ఆయనకు చికిత్స కొనసాగించారు. వైద్యుల సలహాలు, సూచనలు అన్నీ పాటించిన హరీష్ రావు చివరకు కరోనాను జయించారు.



కరోనా టెస్టులో హరీష్ రావుకు నెగెటీవ్ అని తేలడంతో ఆయన ప్రస్తుతం జరుగుతోన్న తెలంగాణ శాసనసభకు హాజరు అయ్యే అవకాశం ఉంది.  హరీష్ రావు కోలుకోవడంతో తెరాస పార్టీనేతలు, శ్రేణులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.