Indrakaran Reddy: యాదాద్రి సన్నిధిలో యుద్ధ ప్రాతిపదికల మరమ్మతులు కొనసాగుతున్నాయన్నారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. రాజకీయ లబ్ధి కోసమే ఆలయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పవిత్రమైన ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీయడం సరికాదన్నారు. యాదాద్రిలో భక్తుల సౌకర్యాలపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల కురిసిన అకాల వర్షానికి యాదాద్రి అతలాకుతలమైంది. క్యూకాంప్లెక్స్‌లు సైతం దెబ్బతిన్నాయి. ఆలయ ప్రాంగణంలోకి భారీగా నీరు చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘాట్‌ రోడ్డు దెబ్బతినడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి..పరిస్థితిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరుపై మండిపడ్డారు. చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దది చేస్తున్నారన్నారు. 


క్యూకాంప్లెక్స్‌లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. అకాల వర్షంతో దెబ్బతిన్నవన్నీ పూర్తి చేయాలన్నారు మంత్రి. కూలిన పందిళ్లు, ఇతర వసతుల ఏర్పాటుపై ఆరా తీశారు. అకాల వర్షం వల్ల ఎంత నష్టం ఏర్పడి అన్న దానిపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఇలాంటి సమస్యలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూడాలన్నారు. 


మౌలిక వసతులను తక్షణమే కల్పించాలన్నారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. ప్రధాన ఆలయంలోపాటు మిగతా నిర్మాణాల పురోగతిని తెలుసుకున్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి ప్రభుత్వం అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. క్యూలైన్లలో భక్తులు ఎక్కువ సేపు ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వసలి కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని అధికారులను ఆదేశించారు. 


దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్(KCR)..ఆలయాన్ని పునర్‌ నిర్మించారని గుర్తు చేశారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని అధికారులు పనిచేయాలన్నారు. భారీ వర్షం కురవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు మంత్రి. సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్‌రావు, ఆర్‌ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్‌ఈ వసంత్‌కుమార్, ఆలయ ఇంఛార్జ్ ఈవో రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


 


Also read:Funny Video: దొంగల్లో వీడో ఓ వెరైటీ..పెళ్లిలో దొంగగా మారిన ఫోటోగ్రాఫర్‌


Also read:KGF 2 Records & OTT: కేజీఎఫ్ ఛాప్టర్ 2 మరో రికార్డు.. ఓటీటీలో ఎప్పుడో తెలుసా..??


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.