KGF 2 Records & OTT: కేజీఎఫ్ ఛాప్టర్ 2 మరో రికార్డు.. ఓటీటీలో ఎప్పుడో తెలుసా..??

KGF 2 Records & OTT: రాకీభాయ్ అలియాస్ యశ్ బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగిస్తున్నాడు. ప్రతిరోజూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. కేజీఎఫ్ ఛాప్టర్ 2 సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 7, 2022, 04:05 PM IST
  • బాక్సాఫీసు వద్ద రికార్డుల వర్షం కురిపిస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2
  • కేజీఎఫ్ 2 అమెజాన్ ప్రైమ్ విడుదల ఈ నెల 27వ తేదీన
  • బాహుబలి 2 రికార్డుకు సమీపంలో కేజీఎఫ్ 2 హిందీ వెర్షన్
KGF 2 Records & OTT: కేజీఎఫ్ ఛాప్టర్ 2 మరో రికార్డు.. ఓటీటీలో ఎప్పుడో తెలుసా..??

KGF Chapter 2 and OTT Release Date:  రాకీభాయ్ అలియాస్ యశ్ బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగిస్తున్నాడు. ప్రతిరోజూ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. కేజీఎఫ్ ఛాప్టర్ 2 సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

ఇప్పుడు ఎక్కడ చూసినా కేజీఎఫ్ ఛాప్టర్ 2 చర్చే నడుస్తోంది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం ఇప్పట్లో ఆగేలా లేదు. ప్రతిరోజూ కొత్త రికార్డు సృష్టిస్తోంది. ఇప్పుడు బాక్సాఫీసు వద్ద కేజీఎఫ్ 2 ...4 వందల కోట్ల వసూలు చేసి కొత్త చరిత్ర రేపింది. ఈ సినిమా హిందీ వెర్షన్ ఇప్పటి వరకూ 4 వందల కోట్లు వసూలు చేసిందని ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. బాహుబలి 2 తరువాత ఇదగి రెండవది. కేజీఎఫ్ 2 విడుదలైన మూడవ వారపు శుక్రవారం 3.85 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకూ 401.80 కోట్లు వసూలైంది. 

యశ్ నటించిన కేజీఎఫ్ 2 బాక్సాఫీసు వద్ద సంచలనంగా మారింది. మరోవైపు ఓటీటీ హక్కుల్ని భారీ ధరకు అమ్ముకోవడం ద్వారా నిర్మాతలు మరింత ఆర్జించారు. ఓ ప్రముఖ ఓటీటీ వేదిక..కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాను 320 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా త్వరలో ఓటీటీలో తెలుగు, కన్నడ, తమిళం, మళయాలం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కేజీఎప్ 2 అమెజాన్ ప్రైమ్‌లో ఈ ెల 27వ తేదీన స్ట్రీమ్ కానుందని సమచారం. అయితే సినిమా నిర్మాతలు మాత్రం ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. 

Also read: Mehreen Pirzada Photos: అందమైన నవ్వుతో రోజా పువ్వల్లే మెరిసిపోతున్న బబ్లీ బ్యూటీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News