Telangana: తెలంగాణలో త్వరలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డు, మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన
Telangana: తెలంగాణ ప్రజలకు శుభవార్త. అర్హులైన లబ్దిదారులకు త్వరలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు అందనున్నాయి. కైతలాపూర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Telangana: తెలంగాణ ప్రజలకు శుభవార్త. అర్హులైన లబ్దిదారులకు త్వరలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు అందనున్నాయి. కైతలాపూర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు రానున్నాయి. కైతలాపూర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ పలు విషయాలు ప్రస్తావించారు. త్వరలో రాష్ట్రంలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే లేదా స్థానిక కార్పొరేటన్ ప్రజల వద్దకే వచ్చి..అర్హులైనవారికి అందించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి ముందు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 29 లక్షలమందికి మాత్రమే పెన్షన్ ఉండేదని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. అప్పట్లో పెన్షన్ 2 వందలు, 5 వందలుండేదన్నారు. ఆ తరువాత పెన్షన్ల సంఖ్య 40 లక్షలకు పెరగగా..పెన్షన్ మొత్తం 2 వేలైందని స్పష్టం చేశారు. ఆ తరువాత ఇంకా పెరిగి 3 వేలైందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వం పెన్షన్లకు 8 వందలకోట్లు ఖర్చుపెడితే..తెలంగాణలో పదివేల కోట్లు పెన్షన్లకు ఖర్చవుతోందన్నారు. పేదప్రజల ముఖంలో చిరునవ్వు చూడటమే తమ లక్ష్యమన్నారు.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook