Ktr On Hyderabad:తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్న సమయంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించారు కేటీఆర్.తనతో పాటు మరో ఐదుగురు మంత్రులను వెంట తీసుకెళ్లారు. కేటీఆర్ తో పాటు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి హెలికాప్టర్ లో సాగర్ వెళ్లారు. హైదరాబాద్‌ తాగునీటి సరఫరా కోసం సుంకిశాలలో జలమండలి నిర్మించనున్న ఇనెటెక్‌ వెల్‌కు పనులకు శంకుస్థాపన చేశారు.పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు కేటీఆర్. తర్వాత జరిగిన సభలో హాట్ కామెంట్స్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్ తాగునీటి సమస్య తీర్చేందుకు సీఎం కేసీఆర్ కొత్త ప్రాజెక్టు చేపట్టారని చెప్పారు. వచ్చే వందేళ్ల నీటి అవసరాల కోసం పెద్దవూర మండలం సుంకిశాల దగ్గర ఇన్ టేక్ వెల్ నిర్మించామని తెలిపారు. సుంకిశాల ఇన్ టేక్ వెల్ తో హైదరాబాద్ మహానగరం తాగునీటి అవసరాలు పూర్తిగా తీరుతాయన్నారు. హైదరాబాద్ కు ఇకపై నీటి కష్టాలు రాబోవన్నారు కేటీఆర్. ఈ ప్రాజెక్ట్ కేసీఆర్ ముందు చూపుకు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. త్వరలో నిర్మించబోతున్న ఆర్ఆర్ఆర్ రోడ్డు వల్ల నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రాజెక్టుని డిజైన్ చేశామన్నారు. హైదరాబాద్ ప్రజలు కేసీఆర్ కు ఎంతో రుణపడి ఉంటారంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు కేటీఆర్.


దేశంలో ప్రస్తుతం హైదరాబాదే శరవేగంగా అభివృద్ది చెందుతున్న నగరమన్నారు కేటీఆర్.త్వరలోనే ఢిల్లీ తర్వాత రెండో అతి పెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించబోతుందని చెప్పారు. ప్రకృతి పరంగా మన హైదరాబాద్ కు ఎన్నో గొప్ప వనరులు,గొప్ప అనుకులతలు ఉన్నాయన్నారు. దేశ వ్యాప్తంగా తాగునీటి కష్టాలు ఉన్నాయని.. కొన్ని నగరాల్లో దారుణ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. కాని హైదరాబాద్ ప్రజలకు మాత్రం ఎలాంటి డోకా లేదన్నారు. గొప్ప దార్శనికత ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం హైదరాబాద్ ప్రజల అదృష్టమన్నారు కేటీఆర్.


1450 కోట్ల రూపాయలతో  అదనంగా 16 టీఎంసీల నీటిని  పంపింగ్ చేసేలా సుంకిశాల ఇన్ టెక్ వెల్ నిర్మిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. మోటార్లు పెట్టి నీటిని పంపింగ్ చేసేలాకూడా  సివిల్ వర్క్స్ జరుగుతున్నాయన్నారు. రాబోయే ఎండాకాలం వరకు ఈ ప్రాజెక్టు ను పూర్తి చేస్తామని తెలిపారు. ఎమర్జెన్సీ  పంపింగ్ అనే సమస్య లేకుండా ఈ పంపింగ్ స్టేషన్ ను నిర్మిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ను కాలంతో పోటీ పడుతూ కేసీఆర్ పూర్తి చేశారని అన్నారు. వరుసగా ఏడేళ్లుగా కరువు వచ్చినా తాగు నీటికి తిప్పలు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ చుట్టు ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా కూడా వాటర్ పైప్ లైన్ లను ఏర్పాటు చేస్తున్నామని  కేటీఆర్ చెప్పారు.


READ ALSO: One Family One Ticket: రేవంత్ రెడ్డి,ఉత్తమ్, భట్టి,కోమటిరెడ్డికి షాక్! టీపీసీసీలో రచ్చేనా?


READ ALSO: Amit Shah Hyd Visit: అమిత్ షా జీ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి... కేంద్రమంత్రిని నిలదీసిన ఎమ్మెల్సీ కవిత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి