KTR Letter to Nirmala Sitharaman: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్‌ తీవ్రమవుతోంది. ప్రతి అంశంపై ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే టార్గెట్‌ తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్‌ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. సీఎం కేసీఆర్ సైతం జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ చేయడంతో..బీజేపీయే టార్గెట్‌గా టీఆర్ఎస్ ముందుకు వెళ్తోంది. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ లేఖాస్త్రం సంధించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రూ.40 వేల కోట్ల తెలంగాణ రాష్ట్ర ఆస్తులను మోదీ ప్రభుత్వం అమ్ముతోందని ఆరోపించారు. ఇందుకు ప్రయత్నాలు సైతం జరుగుతున్నాయని విమర్శించారు. హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్థాన్‌ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మా స్యూటికల్స్ లిమిటెడ్, హెచ్‌ఎంటీ(HMT), సిమెంట్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(CCI), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను విక్రయిస్తోందని లేఖలో మండిపడ్డారు. 


ఆరు సంస్థలకు గతంలో ప్రభుత్వం సుమారు 7 వేల 2 వందల ఎకరాల భూమిని కేటాయించిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ప్రభుత్వ ధరల ప్రకారం భూముల విలువ కనీసం రూ.5 వేల కోట్లకు పైగా ఉంటుందన్నారు. బహిరంగ మార్కెట్‌ ధరల ప్రకారం రూ.40 వేల కోట్లు ఉంటుందని తెలిపారు. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రప్రభుత్వం కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు, సంస్థలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 


అలా కానీ పక్షంలో ఆయా భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలన్నారు. వీటిని రాష్ట్రాభివృద్ధికి ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ప్రజా రవాణా కోసం స్కై వే ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలంటున్న కేంద్ర ప్రభుత్వానికి..రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. 


Also read:Agnipath: అగ్నిపథ్‌ ద్వారానే ఆర్మీ రిక్రూట్‌మెంట్..కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..!


Also read:YCP Plenary Meeting: ఏపీలో వైసీపీ ప్లీనరీ సమావేశాల తేదీలు ఖరారు..ఎప్పటి నుంచో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook