Tesla vs Telangana: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాతో భారత ప్రభుత్వం మధ్య ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు టెస్లాను ట్వీట్ చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో టెస్లా కార్ల ప్రవేశం విషయంలో ఇంకా సందిగ్దత కొనసాగుతోంది. మరోవైపు ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వాన్ని ఉద్దేశించి టెస్లా అధినేత చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యల్ని ట్యాగ్ చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అసలేం జరిగిందంటే..


ప్రపంచ మార్కెట్‌‌లో రెండవ స్థానంలో ఉన్న ఇండియాలో తమ కార్లను ప్రవేశపెట్టేందుకు టెస్లా (Tesla) అధినేత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఈ విషయంపై భారత ప్రభుత్వం, మస్క్‌ మధ్య జరుగుతున్న చర్యలు కొలిక్కి రావడం లేదు. ముందు బయటి దేశాల్లో ఉత్పత్తి అయిన కార్లను ఇండియాలో ప్రవేశపెడతామని దిగుమతి సుంకాన్ని తగ్గించాలనేది టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) కోరుతున్నాడు. అయితే ఇండియా మాత్రం ముందు ముందు దేశంలో ఉత్పత్తి యూనిట్లు నెలకొల్పితేనే...సుంకంలో రాయితీ ఇస్తామంటోంది. ఈ క్రమంలో ఓ నెటిజన్ సంధించిన ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌కు కారణమైంది. టెస్లా కార్లు (Tesla Electric Cars) బాగుంటాయి. ఇండియాలో విడుదలపై ఏమైనా అప్‌డేట్ ఉందా అని ప్రశ్నించిన నెటిజన్‌కు సమాధానంగా భారత ప్రభుత్వంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ..ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని ఎలాన్ మస్క్ చెప్పాడు. దీంతో ఎలాన్ మస్క్‌పై నెటిజన్లు మండిపడ్డారు.



ఇప్పుడు ఎలాన్ మస్క్ ఆ నెటిజన్‌కు ఇచ్చిన సమాధానాన్ని ట్యాగ్ చేస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) ట్వీటా్ చేశారు. దేశంలో, తెలంగాణ టెస్లా కార్యకలాపాల్లో భాగస్వామ్యమయితే చాలా సంతోషిస్తానని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పారిశ్రామిక, అభివృద్ధి, పెట్టుబడులు, సుస్థిరత విషయాల్లో తెలంగాణ ఛాంపియన్‌గా నిలిచిందన్నారు. పెట్టుబడులకు రాష్ట్రం స్వర్గధామంగా ఉందన్నారు. 


Also read: Corona in Telangana: రాష్ట్రంలో తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 2,398 మందికి పాజిటివ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook