Trs Bjp War: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ ముదురుతోంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటనలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సభలో వేముల ప్రసంగిస్తుండగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జై శ్రీరాం నినాదాలతో హోరెత్తించారు. దీంతో కాసేపు తన ప్రసంగాన్ని ఆపేశారు ప్రశాంత్ రెడ్డి. మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వారించడంతో కమలం కార్యకర్తలు కూలయ్యారు. అయితే నితిన్ గడ్కరీ సభలో బీజేపీ కార్యకర్తల,నాయకుల వ్యవహార శైలిపై తెలంగాణ మంత్రి
వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలను తరలించారని ఆరోపించారు. తాను రాష్ట్ర ప్రభుత్వం తరపున మాట్లాడుతుంటే బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ అడ్డుపడ్డారని ఫైరయ్యారు.ముగ్గురు కేంద్రమంత్రుల సమక్షంలో కమలం పార్టీ కార్యకర్తలు చిల్లరగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను మంట కలిపారని ప్రశాంత్ రెడ్డి అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీచమైన కేంద్ర బీజేపీలో ఏకైక మంచి మనిషి నితిన్ గడ్కరీ అని ప్రశాంత్ రెడ్డి అన్నారు. రహదారుల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని గడ్కరీ లేఖ రాస్తే.. తెలంగాణ సర్కార్ తరుపున రోడ్లు భవనాల శాఖ మంత్రిగా తాను వెళ్లానని తెలిపారు. తెలంగాణలో పురోగమిస్తున్న రాష్ట్రమని గడ్కరీ తన ప్రసంగంలో చెప్పారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. బీజేపీ కార్యకర్తలను వేలాదిగా తరలించారని మండిపడ్డారు. ఒక్కో బీజేపీ కార్పొరేటర్ వెయ్యి మందిని తీసుకురావాలని కండీషన్ పెట్టారని చెప్పారు. బీజేపీ కండువాలు వేసుకోని ప్రభుత్వ కార్యక్రమంలో ఎలా కూర్చుంటారని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. తాను ప్రసంగం మొదలు పెట్టగానే కాషాయ కండువా కప్పుకున్న కమలం కార్యకర్తలు జైశ్రీరాం నినాదాలు చేశారని తెలిపారు.


జాతీయ రహదారులను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా అడుగుతుందని.. కేంద్రం బాధ్యతగా ఇస్తుందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో తాను మాట్లాడితే అంత ఉలికిపాటు ఎందుకని వేముల ప్రశ్నించారు.  8వేల కోట్లు గిఫ్ట్ గా ఇస్తున్నామని చెప్పడం సరికాదన్నారు. మిగితా రాష్ట్రాల తరహాలోనే తెలంగాణకు కేంద్రం ఇచ్చిందన్నారు ప్రశాంత్ రెడ్డి. ప్రభుత్వ కార్యక్రమాన్ని బీజేపీ పార్టీ కార్యక్రమంలా చేశారని మండిపడ్డారు. బీజేపీ ఏమైనా చెప్పాలనుకుంటే లక్ష మంది సభ పెట్టుకుని చెప్పుకోవచ్చన్నారు. తనను మాట్లాడకుండా చేస్తే నిజాలు ఆగకుండా ఉంటాయా అని ప్రశాంత్ రెడ్డి నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను అడుగుతానని భయంతోనే తన ప్రసంగాన్ని అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.బీజేపీ కార్యకర్తలు బజారు రౌడీలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలు చేసిన చిల్లర వ్యవహారానికి కేంద్రమంత్రి  క్షమాపణ చెప్పాల్సి వచ్చిందన్నారు ప్రశాంత్ రెడ్డి.


READ ALSO: Harish Rao Comments: రాహుల్‌గాంధీపై హరీష్‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు..!


Bjp Slogans at Minster Prasanth Reddy: మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎదుట జైశ్రీరాం నినాదాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook