Harish Rao Comments: రాహుల్‌గాంధీపై హరీష్‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు..!

Harish Rao Comments: తెలంగాణలో రాహుల్‌గాంధీ టూర్‌ పై మాటలయుద్ధం మరింత ముదురుతోంది. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాహుల్‌గాంధీ ఓయూలో అడుగుపెట్టాలని బాల్క సుమన్ చేసిన కామెంట్లు ఇప్పటికే కాక రాజేశాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 29, 2022, 05:31 PM IST
  • రాహుల్‌గాంధీపై హరీష్‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు
  • తెలంగాణలో రాహుల్‌గాంధీ టూర్‌ పై మాటల యుద్ధం
  • గట్టికౌంటర్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
Harish Rao Comments: రాహుల్‌గాంధీపై హరీష్‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు..!

Harish Rao Comments: తెలంగాణలో రాహుల్‌గాంధీ టూర్‌ పై మాటలయుద్ధం మరింత ముదురుతోంది. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాహుల్‌గాంధీ ఓయూలో అడుగుపెట్టాలని బాల్క సుమన్ చేసిన కామెంట్లు ఇప్పటికే కాక రాజేశాయి. దీనిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గట్టికౌంటరే ఇచ్చారు. బాల్క సుమన్ ఉద్యమసమయంలో విద్యార్థులను చంపాడని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. తెలంగాణ ఇచ్చిన రాహుల్‌ పర్యటనకు అనుమతులు ఎందుకివ్వరంటూ నిలదీశారు.

ఈ వివాదం ఇలా కొనసాగుతూ ఉండగానే మంత్రి హరీష్‌రావు రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ ఓ ఐరన్‌ లెగ్గని అన్నారు మంత్రి హరీష్‌రావు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ ఖతమైందన్నారు. ఇప్పటివరకు రాహుల్ ప్రచారంచేసిన ప్రాంతాల్లో 94 శాతం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు. ఇప్పుడు తెలంగాణలో అడుగుపెట్టి రాహుల్ ఏం ఉద్దరిస్తారన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ గతచరిత్ర అని స్పష్టంచేశారు హరీష్‌రావు.

రాష్ట్రప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్నారు టీ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు గట్టిగానే కృషిచేస్తున్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా మే 6,7 వ తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. మే 6 న వరంగల్ లో రైతుల సమస్యలపై భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మే 7 న హైదరాబాద్ లో రాహుల్ పర్యటిస్తారు. కాంగ్రెస్ నేతలతో సమావేశమై పార్టీ పరిస్థితిపై చర్చిస్తారు. పర్యటనలో భాగంగా ఓయూలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం ఇప్పటికే ఓయూ వీసీని అనుమతి కోరింది. అయితే ఇప్పటివరకు ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతులు రాలేదు. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీ పర్యటన విజయవంతం చేయడం కోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్ కు దిశానిర్ధేశం చేస్తున్నారు.

Also Read: Planet Parade: ఖగోళంలో 1000 ఏళ్ల తరువాత కన్పించనున్న అద్భుత దృశ్యం..మళ్లీ చూడలేరు!

Also Read: Ramya Murder Case Verdict: బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు.. దోషికి ఉరి

రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News