Telangana MLC Elections 2021 Votes Counting: తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మార్చి 14వ తేదీన జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్‌నగర్‌ ఉమ్మడి పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు నగరంలోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కొనసాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు వరంగల్ - ఖమ్మం - నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్లగొండలోని మార్కెట్ గిడ్డంగిలో మొదలైంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (Telangana Graduate MLC Elections) వెలువరించడానికి రెండు రోజుల సమయం పట్టనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫలితాలు తేలాలంటే మరో రోజు వేచిచూడక తప్పదని సమాచారం.


Also Read: Telangana Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం ఇదే, అలాచేస్తే మీ ఓటు చెల్లదు


హైదరాబాద్ స్థానం నుంచి అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా సురభి వాణీదేవి, బీజేపీ నుంచి రామచందర్‌రావు, ఇండిపెండెంట్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్‌రావుల మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నల్లగొండ స్థానం నుంచి టీఆర్ఎస్(TRS) అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీజేఎస్ అభ్యర్థి, ప్రొఫెసర్ ఎం కోదండరాం మధ్య పోటీ నెలకొంది.


గురువారం ఉదయం తొలి ప్రాధాన్య ఫలితం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్య ఓటు ఫలితాలు మార్చి 18న ఉదయం వెలువడనున్నాయని తెలుస్తోంది. అదే సమయంలో ఓటింగ్ నిబంధనల్ని పాటించకుండా వేసిన ఓట్లను పరిశీలించి చెల్లని ఓట్లను వెల్లడిస్తారు. చెల్లిన ఓట్లను నిర్ణయించిన తరువాత ఎన్నికల్లో అభ్యర్థి విజయానికి కావాలసిన ఓట్ల కోటాపై స్పష్టత వస్తుంది. విజయానికి నిర్ణయించిన కోటాలో తొలి ప్రాధాన్య ఓట్లు వస్తే ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటించనున్నారు. ఒకవేళ తొలి ప్రాధాన్య ఓట్లలో కావాల్సిన మెజార్టీ రాని పక్షంలో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు.


Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం ధరలు, మిశ్రమంగా Silver Price 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook