Telangana: దాన్ని నేను వ్యతిరేకించట్లేదు.. కానీ..
తెలంగాణ గంగా అయిన మూసి నదిని పరిరక్షించాలని ప్రధానమంత్రితో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. కాలుష్యంతో మూసి ఉనికికే ప్రశ్నార్ధకంగా మారిందని, ఫార్మా కంపెనీలు, డ్రైనేజీ నీరుతో మూసినది కాలుష్యమయమవుతోందని అన్నారు. భూ గర్భ జలాలు
న్యూఢిల్లీ: తెలంగాణ గంగా అయిన మూసి నదిని పరిరక్షించాలని ప్రధానమంత్రితో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. కాలుష్యంతో మూసి ఉనికికే ప్రశ్నార్ధకంగా మారిందని, ఫార్మా కంపెనీలు, డ్రైనేజీ నీరుతో మూసినది కాలుష్యమయమవుతోందని అన్నారు. భూ గర్భ జలాలు కలుషితం అవుతున్నాయని, దీని వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, నమామి గంగా తరహాలో మూసీ నదిని ప్రక్షాళన చేపట్టాలని అన్నారు.
Read Also: కింగ్ కోబ్రానే మట్టికరిపించిన ముంగూస్ వీడియో వైరల్...
మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గల గౌరెల్లి జంక్షన్-కొత్తగూడెం జాతీయ రహదారికి నెంబరింగ్ ఇవ్వాలని, వలిగొండ,పోచంపల్లి, తిరుమలగిరి, తొర్రురు, నెల్లికుదురు మహబూబ్ బాద్, ఇల్లందు మీదుగా హైద్రాబాద్ కొత్త గూడెం మధ్య రహదారిని జాతీయ రహదారిగా
గుర్తించినప్పటికీ మరమ్మతులకు నోచుకోవడం లేదని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా హైదరాబాద్, విశాఖపట్నం, ఛత్తీస్ ఘడ్ ల మధ్య దూరాన్ని 100 కిలో మీటర్లు తగ్గిస్తుందని అన్నారు.
Read Also: 'కరోనా వైరస్' మీద పాట..!!
ఫార్మా పరిశ్రమ వల్ల పర్యావరణం, నీరు, భూమి, వాతావరణం కాలుష్యం అవుతాయని మేడిపల్లి (ముచ్చర్ల లో) ఏర్పటు చేయనున్న ఫార్మా సిటీకి అనుమతులు రద్దు చేయాలని ప్రధానమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగల కల్పన పేరుతో 3వేల ఎకరాలలో ఫార్మా సిటీ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తుందని, ఫార్మా సిటీని 3000 ఎకరాలను నుండి 19,333 ఏకరాలకు విస్తరించేందుకు ప్రయత్నం చేస్తుందని, సేకరిస్తున్న భూమి వ్యవసాయానికి యోగ్యంతో పాటు మంచి పంటలు పండే భూములని,ఫార్మా సిటీతో కాలుష్యం బారిన పడే ప్రమాదం ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..