బోధన్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో అక్కడక్కడా నేతల మధ్య వివాదాలు తలెత్తాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. 32వ వార్డులో దొంగ ఓట్ల వివాదం చివరికి టీఆర్ఎస్ నేత గాయపడేలా చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాజ్ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నాడని టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ ఆరోపించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తనపై ఆరోపణలు చేస్తున్నాడన్న ఆవేశంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఇమ్రాన్ ముక్కును ఇలియాజ్ కొరికేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడు ఇమ్రాన్‌ను ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తనపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఇమ్రాన్ ఆరోపించాడు. అనంతరం బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ హాస్పిటల్‌కు వెళ్లి పార్టీ అభ్యర్థి ఇమ్రాన్‌ను పరామర్శించారు. ఎన్నికల అధికారుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Also Read: తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికలు


కాగా, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఓటింగ్ బుధవారం సాయంత్ర 5ం గంటలకు ముగిసింది. నిర్ణీత సమయానికి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. జనవరి 25న ఫలితాలు వెలువడనున్నాయి. కరీంనగర్ నగరపాలక సంస్థ మినహా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ పూర్తయింది. కరీంనగర్‌ నగరపాలక సంస్థకు 24న ఎన్నికలు, 27న ఫలితాలు వెల్లడిస్తారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..