తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికలు

తెలంగాణలో పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బుధవారం సాయంత్రం 5 గంటలకు మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు ఈ 25న వెలువడనున్నాయి.

Updated: Jan 22, 2020, 05:55 PM IST
తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికలు
File Photo

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా (కరీంనగర్ మినహా) 9 నగరపాలక సంస్థలు, 120 పురపాలకల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలలోగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటేసేందుకు అనుమతిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సాధారణ ఓటర్లతో పాటుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని కేంద్రాలలో ఘర్షణ తలెత్తగా, చాలా వరకు ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది.

Also Read: ఆ టీఆర్ఎస్ నేతలను పీకిపారేస్తాం: కేటీఆర్

మధ్యాహ్నం 3 గంటలవరకు 67 శాతం ఓటింగ్ నమోదు కాగా, సాయంత్రం 5 గంటలవరకు దాదాపు 75 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఈ పోల్ ఫలితాలను శనివారం (జనవరి 25న) ప్రకటించనున్నారు. మరోవైపు కరీంనగర్ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచార గడువు నేటి సాయంత్రం ముగిసింది. ఈ 25 ఓటింగ్ నిర్వహించి, 27న కరీంనగర్ పాలకసంస్థ ఫలితం తేలనుంది.

Also Read: కేటీఆర్‌వి ఉత్తరకుమార ప్రగల్భాలు: కిషన్ రెడ్డి 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరహాలో ఓటర్లు మున్సిపల్ ఎన్నికల్లోనూ తమకే పట్టం కడతారని అధికార టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ ప్రస్తుతం చాలా పుంజుకుందని, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో టీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. స్థానికంగా తమకు బలం చేకూరిందని బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తానికి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల అధికారులు తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..