Wishes to Revanth Reddy: తెలంగాణ మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్డేడియంలో మద్యాహ్నం 1.04 గంటలకు తరువాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. మరో పది మంది మంత్రులుగా తెలంగాణ కాంగ్రస్ కేబినెట్‌లో చేరారు. తెలంగాణ కొత్త ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్ సహా పలువురు అబినందనలు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లకు కాంగ్రెస్ తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వరుసగా తొలి పదేళ్లు రెండు పర్యాయాలు ప్రభుత్వం స్థాపించిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్‌ను ఓడించి తెలంగాణలో అధికారం చేజిక్కించుకుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క సహా మరో పదిమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబులు అభినందనలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు


ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అభినందనలు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇస్తున్నాను అంటూ మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.



ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు


తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమాక్ర గారికి , మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.



జనసేనాని పవన్ కళ్యాణ్ అభినందనలు


తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన మంత్రివర్గ సహచరులకు శుభాభినందనలు. రాష్ట్ర సాధన కోసం అమరులైన యువత, ఏ ఆశయాల కోసం ఆత్మ బలిదానం చేసిందో వాటిని సంపూర్ణంగా నెరవేర్చి ఆ త్యాగాలకు గౌరవాన్ని, సార్ధకతను కల్పించాలి అంటూ ప్రకటన విడుదల చేశారు. 


చంద్రబాబు అభినందనలు


తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారికి కంగ్రాట్స్. ఆయన ప్రజాసేవలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.



Also read: Telangana New Government: కొలువుదీరిన కొత్త ప్రభుత్వం, ఎవరెవరికి ఏయే శాఖలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook