Father Puts Funeral Poster For Daughter Over Love Marriage: ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల్ని గారాబంగా పెంచుకుంటారు. తమ గారాల బిడ్డలను గుండెల మీద పెట్టుకుని మరీ చూసుకుంటారు. పిల్లల కోసం ఎంత కష్టాన్నైన కూడా భరిస్తారు. పొరపాటున పిల్లలకు ఏమైన జరిగితే విలవిల్లాడిపోతుంటారు. చిన్న తనంనుంచి అడిగింది లేదనకుండా.. ఒక వేళ తమకు పెట్టే స్తోమతలేకున్న కూడా, అప్పులు చేసి కూడా తమ బిడ్డకోరికలను తీరుస్తుంటారు. ఇలాంటి తల్లిదండ్రుల పట్ల కొందరు యువత దారుణంగా ప్రవర్తిస్తుంటారు. చిన్నతనం నుంచి తమ సర్వస్వం అనుకున్న పిల్లలు, పెద్దాయ్యాక.. ఎవర్నోకలిసి ప్రేమ పేరుతో, వారితో వెళ్లిపోతుంటారు. దీంతో ఇన్నేళ్ల పాటు, కష్టపడి, పెంచి పోషించిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనలకు లోనౌతుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కొందరు తమ పిల్లల ప్రేమలను అంగీకరిస్తారు. కానీ మరికొందరు పిల్లల సుఖంగా ఉండాలని, కేవలం యుక్తవయస్సులో వచ్చిన ఆకర్శణను ప్రేమ అనుకొని, మోసపోతుంటారని తమ పిల్లలను ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుతుంటారు. కానీ కొందరికి తల్లిదండ్రుల ప్రేమ అంటే ఎంతో చులకన. ఈ ప్రేమను వారు అర్ధం చేసుకోకుండా, మెజర్లమయ్యాం.. మా ఇష్టమంటూ గుండెల మీద తన్నేసి వెళ్లిపోతుంటారు. ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 


పూర్తి వివరాలు..


సిరిసిల్ల పట్టణంలోని ఒక యువతి చేసిన పని ఆ కుటుంబలో తీవ్ర విషాదంను నింపింది. చిరువేరీ మురళి  అనే వ్యక్తి సంతానం అనూష. ఆమెను మురళి చిన్నతనం నుంచి ఎంతో గారాబంగా పెంచుకున్నాడు. కూతురుకు ఏంకావాల్సి వచ్చిన తెచ్చిపెట్టేవాడు. బీటెక్ కోసం మల్లారెడ్డి వుమెన్స్ కాలేజీలో కూడా చేర్పించాడు. తన కూతురు గొప్ప ప్రయోజకురాలు కావాలని ఆతండ్రి కలలు కన్నాడు. కానీ అనూష మాత్రం, చదువుకొవాల్సిన వయస్సులో మరో యువకుడితో ప్రేమ పడింది. అంతేకాకుండా.. ఇంట్లో వాళ్లకు చెప్పపెట్టకుండా పారిపోయి మరీ పెళ్లికూడా చేసుకున్నారు. దీంతో ఆ తండ్రి తన ఇంటి ముందు కూతరు ఫ్లెక్సీ చేయించి కన్నీళ్లు పెట్టిన ఘటన అందరికి కలిచి వేస్తుంది. ఒక్కమాట తమతో చెప్తే, పెద్దలు మాట్లాడే వాళ్లంకదా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.


అంతేకాకుండా..తమ బిడ్డను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నారంటూ కూడా మండిపడ్డాడు. ఈ క్రమంలోనే అంతపెద్ద పనులు చేసేటప్పుడు కనీసం, కన్నతండ్రి గుర్తుకురాలేడా.. ఇన్నాళ్లు నా బిడ్డకోసం ఎంతో త్యాగాలు చేశానంటూ ఆ తండ్రి ఆవేదన చెందాడు. ఇక.. తన కూతురు పెట్టిన మానసిక బాధను భరించలేక.. ఆమె చనిపోయినట్లు ఫ్లెక్సీ చేయించాడు.


Read More: Snakes: ఇదేం విడ్డూరం.. పాముల్ని పెంచుకుంటున్న గ్రామస్థులు.. హనీ కలిగిస్తే అరెస్ట్ చేస్తారంట..


ఇలాంటి పరిస్థితి మరేవ్వరికి రావోద్దంటూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. తల్లిదండ్రులు కూతుళ్లను జాగ్రత్తగా చూసుకొవాలని, ఇలాంటి ట్రాప్ లకు పాటు పడే వారు ఉంటారని కూడా తండ్రి వాపోయాడు. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన చుట్టుపక్కల వారు కూడా తండ్రి బాధకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook