Ex MLC Fariduddin: తెలంగాణలోని జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఫరీదుద్దీన్ బుధవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్యంతో ఇటీవలే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సహా ప్రజా సంఘాల నేతలు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గ్రామ సర్పంచ్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ.. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీ శాఖ మంత్రిగా సేవలు అందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం కూడా పూర్తి అయ్యింది. 


సీఎం కేసీఆర్ సంతాపం


మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. మైనారిటీ నేతగా, ప్రజాప్రతినిధిగా వారు చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.  


Also Read: Sri Chaitanya College students: శ్రీ చైతన్య కాలేజీలో కరోనా కలకలం.. 30 మంది విద్యార్థులకు పాజిటివ్!!


Also Read: KTR Comments on Somu Veerraju: రూ.50లకే చీప్‌ లిక్కర్ అన్న బీజేపీ.. వాట్‌ ఏ స్కీమ్‌.. వాట్‌ ఏ షేమ్.. అన్న KTR


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి