KTR Comments on Somu Veerraju: రూ.50లకే చీప్‌ లిక్కర్ అన్న బీజేపీ.. వాట్‌ ఏ స్కీమ్‌.. వాట్‌ ఏ షేమ్.. అన్న KTR

KTR counter on Somu Veerraju comments: విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో చీప్‌ లిక్కర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సోము వీర్రాజు చీప్‌ లిక్కర్‌ వ్యాఖ్యలపై కేటీఆర్ ట్వీట్‌ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 03:53 PM IST
  • ఏపీ బీజేపీ నాయకులు దిగజారిపోయారు..
  • చీప్‌ లిక్కర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై కౌంటర్..
  • ట్విట్టర్‌‌లో స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌
 KTR Comments on Somu Veerraju: రూ.50లకే చీప్‌ లిక్కర్ అన్న బీజేపీ.. వాట్‌ ఏ స్కీమ్‌.. వాట్‌ ఏ షేమ్.. అన్న KTR

TS Minister KTR tweet on BJP Andhra Pradesh BJP chief Somu Veerraju liquor comments : ఏపీ బీజేపీ నాయకులు మరింత దిగజారిపోయారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. తాజాగా విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో చీప్‌ లిక్కర్‌పై (cheap liquor) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Andhra Pradesh BJP chief Somu Veerraju) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. 

సోము వీర్రాజు (Somu Veerraju) చీప్‌ లిక్కర్‌ వ్యాఖ్యలపై కేటీఆర్ ట్వీట్‌ (Tweet) చేశారు. వావ్… వాట్‌ ఏ స్కీమ్‌! వాట్‌ ఏ షేమ్.. ఏపీ బీజేపీ (AP BJP) ఎంత దిగజారుతోంది.. రూ.50లకే చీప్‌ లిక్కర్‌ బీజేపీ జాతీయ విధానమా? అధికారంలోని లేని రాష్ట్రాల‌కే ఈ బంప‌ర్ ఆఫ‌ర్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.

విజయవాడ సభలో సోము వీర్రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీలో చీప్‌ లిక్కర్‌ 70 రూపాయలకే ఇస్తామన్నారు. ఆదాయం బాగుంటే 50 రూపాయలకే ఇస్తామన్నారు సోము వీర్రాజు. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా మంత్రి కేటీఆర్‌ (TS Minister KTR) ట్వీట్ చేశారు.

 

Also Read : Mohammed Shami: 200 వికెట్ అనంతరం.. షమీ ఎమోషనల్ సెలబ్రేషన్స్! ఎవరి కోసమో తెలుసా?

కాగా, ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం... చీప్‌ లిక్కర్‌ తయారుచేసి అమ్ముతోందని సోము వీర్రాజు (Somu Veerraju) ఆరోపించారు. మద్యం తాగే ఒక్కొక్కరి నుంచి 12 వేల రూపాయల దాకా గుంజి.. మళ్లీ ఆ డబ్బునే ఏటా జనాల అకౌంట్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం (YSRCP Government) వేస్తుందని ఆరోపించారు సోము వీర్రాజు.

Also Read : Manchu Manoj Corona: మంచు మనోజ్‌కు కోవిడ్ పాజిటివ్.. ఆందోళన అక్కర్లేదంటూ హీరో ట్వీట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News